మణికొండలో దారుణం: హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

హైదరాబాద్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆవేశంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేసిన సంఘటన  బుధవారం మణికొండలో చోటుచేసుకుంది. రాయదుర్గం ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం… మహబూబాబాద్ జిల్లా రేకుల బి తండాకు చెందిన బానోతు రాము(28) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మణికొండలో ఉంటూ కూలీ పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న రమేష్ భార్యతో రాముకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ఇంట్లోకి రమేష్ వచ్చేసరికి అతడి భార్య […] The post మణికొండలో దారుణం: హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆవేశంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేసిన సంఘటన  బుధవారం మణికొండలో చోటుచేసుకుంది. రాయదుర్గం ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ కథనం ప్రకారం… మహబూబాబాద్ జిల్లా రేకుల బి తండాకు చెందిన బానోతు రాము(28) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి మణికొండలో ఉంటూ కూలీ పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న రమేష్ భార్యతో రాముకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మంగళవారం రాత్రి 8 గంటలకు ఇంట్లోకి రమేష్ వచ్చేసరికి అతడి భార్య శాంతి, రాము సన్నిహితంగా ఉన్నారు. ఇది చూసి భరించలేని రమేష్ ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తితో రామును పొడిచి చంపివేశాడు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని ఇన్స్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు. రాము మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

A Man Murder with fornication in Manikonda

The post మణికొండలో దారుణం: హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: