యువతిని మోసం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు

  మనతెలంగాణ, హైదరాబాద్: వివాహం చేసుకుంటానని చెప్పి ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకుని తల్లిని చేసి మోసం చేసిన కేసులో ఓ యువకుడికి ఎల్‌బి నగర్ కోర్డు పదేళ్ల జైలు, రూ.10,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. మీర్‌పేట పోలీసుల కథనం ప్రకారం… వనస్థలిపురానికి చెందిన షేక్ మహ్మద్ జహంగీర్ పాషా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అదే పాఠశాలలో చదువుకుంటున్న మీర్‌పేటకు చెందిన యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు. 2011లో యువతిని రీసార్ట్‌కు […] The post యువతిని మోసం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ, హైదరాబాద్: వివాహం చేసుకుంటానని చెప్పి ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకుని తల్లిని చేసి మోసం చేసిన కేసులో ఓ యువకుడికి ఎల్‌బి నగర్ కోర్డు పదేళ్ల జైలు, రూ.10,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. మీర్‌పేట పోలీసుల కథనం ప్రకారం… వనస్థలిపురానికి చెందిన షేక్ మహ్మద్ జహంగీర్ పాషా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అదే పాఠశాలలో చదువుకుంటున్న మీర్‌పేటకు చెందిన యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి లొంగదీసుకున్నాడు. 2011లో యువతిని రీసార్ట్‌కు తీసుకువెళ్లి బలవంతం చేసి సెక్స్‌లో పాల్గొన్నాడు. తర్వాత అదే ఏడాది యువతిని వివాహం చేసుకోకుండా వేరే యుతిని పెళ్లి చేసుకున్నాడు.

దీంతో బాధితురాలు నిలదీయగా తన భార్య అంటే తనకు ఇష్టం లేదని, నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పాడు. యువతితో శారీరకు సంబంధం కొనసాగించడంతో యువతి గర్భం దాల్చింది. అబార్షన్ చేయించేందుకు యత్నించగా దానికి యువతి నిరాకరించింది. ఈ క్రమంలో గర్భానికి తనకు సంబంధంలేదని బుకాయించడంతో బాధితురాలు మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి మగబిడ్డకు జన్మనివ్వడంతో డిఎన్‌ఏ టెస్ట్ నిర్వహించాడు. బాబుకు పాషా తండ్రిగా నిర్ధారణ కావడంతో పోలీసులు కోర్టులో సాక్షాలు దాఖలు చేశారు. సాక్షాలు పరిశీలించిన ఎల్‌బి నగర్ కోర్డు పాషాకు శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చింది.

A Man gets 10 years jail for cheating to Girl in LB Nagar

The post యువతిని మోసం చేసిన వ్యక్తికి పదేళ్ల జైలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: