జాత్యాహంకార దాడి.. కోమాలో బాలిక ధృతి

  చికిత్సకు పిలుపుతో పోగైన 6 లక్షల డాలర్లు వాషింగ్టన్: జాత్యాహంకార ఉన్మాద ఘటనలో గాయపడ్డ బాలిక కోసం వారంతా నడుం బిగించారు. ఈ 13 ఏండ్ల బాలిక చికిత్స ఖర్చుల కోసం 6 లక్షల డాలర్లకు పైగా ధనం సేకరించారు. ఈ మానవీయ స్పందనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇండో అమెరికన్ బాలిక ధృతి నారాయణ్ అమెరికాలో కుటుంబంతో నివసిస్తోంది. ఏప్రిల్‌లో వాహనదారుడు ఒకరు ఆమె రోడ్డుపై వెళ్లుతుండగా కావాలనే వాహనాన్ని ఢీకొట్టించాడు. […] The post జాత్యాహంకార దాడి.. కోమాలో బాలిక ధృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చికిత్సకు పిలుపుతో పోగైన 6 లక్షల డాలర్లు

వాషింగ్టన్: జాత్యాహంకార ఉన్మాద ఘటనలో గాయపడ్డ బాలిక కోసం వారంతా నడుం బిగించారు. ఈ 13 ఏండ్ల బాలిక చికిత్స ఖర్చుల కోసం 6 లక్షల డాలర్లకు పైగా ధనం సేకరించారు. ఈ మానవీయ స్పందనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇండో అమెరికన్ బాలిక ధృతి నారాయణ్ అమెరికాలో కుటుంబంతో నివసిస్తోంది. ఏప్రిల్‌లో వాహనదారుడు ఒకరు ఆమె రోడ్డుపై వెళ్లుతుండగా కావాలనే వాహనాన్ని ఢీకొట్టించాడు. ఆమె ముస్లిం అనుకుని ఈ జాత్యాహంకార చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. చికిత్సకు భారీ వ్యయం అవుతుండటంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. కోమాలోకి వెళ్లిన బాలికకు రోజులు గడుస్తున్న కొద్ది ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటంతో వారు నిస్సహాయ స్థితిలో పడ్డారు. ఈ దశలో గో ఫండ్ మి అనే సంస్థ ఈ బాలికకు సాయం కోసం ఆన్‌లైన్‌లో అభ్యర్థించింది. దీనికి స్పందనగా దాదాపు 13వేల మంది ముందుకు వచ్చి విరాళాలు అందించారని, ఈ విధంగా ఆరు లక్షల డాలర్ల వరకూ పోగయిందని సంస్థ తెలిపిందని అమెరికన్ బజార్ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ తెలిపింది. గత నెల 23వ తేదీన తండ్రి రాజేష్ నారాయణ్, సోదరుడు తొమ్మిందేళ్ల ప్రకార్‌తో కలిసి కాలిఫోర్నియాలోని సన్నీవలేలో రోడ్ దాటుతుండగా ఇసాహ్ పీపుల్స్ అనే వ్యక్తి వేగంగా తన వాహనాన్ని వారిపైకి పోనిచ్చినట్లు, కూతురు తీవ్రంగా గాయపడగా తండ్రి స్వల్పంగా గాయపడ్డట్లు వెల్లడైంది. విషయాన్ని తెలుసుకుని ఫండ్ మి సంస్థ ఏడు రోజుల క్రితం ప్రకటన వెలువరించింది. ఓ వ్యక్తి విషపూరిత చర్యతో గాయపడ్డ బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని, ఆమె త్వరితగతిన కోలుకోవాలని ఆశిస్తున్నామని, అయితే ఇందుకు ఆ తరువాత ఈ కుటుంబ పునరావాసానికి కావల్సిన అత్యధిక మొత్తం ప్రధాన సమస్య అని, దీనిపై స్పందించే దాతల కోసం వేచిచూస్తున్నామని సంస్థ తెలిపింది. ప్రాణాలు కడతేర్చే వారితో పాటు ప్రాణాలు నిలిపే వారూ ఉన్నారనే రీతిలో ఇప్పుడు వ్యక్తం అయిన స్పందన ఖండాలు దాటి విశ్వవిఖ్యాతం అయింది. మానవతా బంధాల పెనవేతకు దారితీసింది.

A girl Coma after Racist attack in America

The post జాత్యాహంకార దాడి.. కోమాలో బాలిక ధృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: