అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన వెల్దుర్తి విద్యార్థులు

వెల్దుర్తి: ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఢిల్లీలోని తలకాటోర్ స్టేడియంలో నిర్వహించిన సౌత్ ఏషియా హకాం జాతీయ స్థాయి కరాటే చాంఫియన్ షిప్‌లో వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గెలుపొందారు. వీరికి కరాటే ఆటలో అనూష, పావని, మధు ముగ్గురు గోల్డ్‌మెడల్‌ గెలిస్తే… రుశిక, శ్రీజారెడ్డి, సంజన, శివాని, లక్ష్మణ్, హరీష్‌లు ఆరుగురు సిల్వర్ మెడల్స్ సాధించారు. మరో నలుగురు విద్యార్థులు రోహిత్, బాశేష్, నవదీప్, సాయిలు బ్రోస్‌మెడల్స్‌ను గెలిచారు. వీరి నుంచి […] The post అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన వెల్దుర్తి విద్యార్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వెల్దుర్తి: ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఢిల్లీలోని తలకాటోర్ స్టేడియంలో నిర్వహించిన సౌత్ ఏషియా హకాం జాతీయ స్థాయి కరాటే చాంఫియన్ షిప్‌లో వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గెలుపొందారు. వీరికి కరాటే ఆటలో అనూష, పావని, మధు ముగ్గురు గోల్డ్‌మెడల్‌ గెలిస్తే… రుశిక, శ్రీజారెడ్డి, సంజన, శివాని, లక్ష్మణ్, హరీష్‌లు ఆరుగురు సిల్వర్ మెడల్స్ సాధించారు. మరో నలుగురు విద్యార్థులు రోహిత్, బాశేష్, నవదీప్, సాయిలు బ్రోస్‌మెడల్స్‌ను గెలిచారు. వీరి నుంచి 9 మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారని పిడి ప్రతాప్‌సింగ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన తొమ్మిది మంది విద్యార్థులకు ఆగష్టు నెలలో పోటీలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు అరుదైన శైలిలో పిడి ప్రతాప్‌సింగ్ శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థులకు తల్లితండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు అభినందనలు తెలిపారు.

9th South Asia Hakuakai Karate Championship 2019

The post అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన వెల్దుర్తి విద్యార్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.