మహబూబ్‌నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 9 మంది కూలీలు మృతి

  మహబూబ్‌నగర్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే 9 మంది కూలీలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేేసుకుంది. కూలి పనులు ముగించుకుని ఆటోలో తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో […] The post మహబూబ్‌నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 9 మంది కూలీలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మహబూబ్‌నగర్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే 9 మంది కూలీలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటుచేేసుకుంది. కూలి పనులు ముగించుకుని ఆటోలో తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటో పూర్తిగా నుజ్జనుజ్జయ్యింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

9 workers killed in road accident in Midjil

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మహబూబ్‌నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం… 9 మంది కూలీలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: