88 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్

మహబూబ్ నగర్ : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 88 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కలెక్టర్ రొనాల్డ్ రోస్  సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది. గురువారం హరితహారం, జలశక్తి అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి హాజరైన 64 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు , 24 మంది పంచాయతీ కార్యదర్శులు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ రొనాల్డ్ […] The post 88 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మహబూబ్ నగర్ : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 88 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కలెక్టర్ రొనాల్డ్ రోస్  సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది. గురువారం హరితహారం, జలశక్తి అభియాన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి హాజరైన 64 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు , 24 మంది పంచాయతీ కార్యదర్శులు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన కలెక్టర్ రొనాల్డ్ రోస్ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చర్య ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగమంటే ఆటవిడుపుగా భావించే వారికి కలెక్టర్ తీసుకున్న చర్య శరాఘాతం వంటిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా ప్రజలు కలెక్టర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ ఉద్వోగులకు ఇది గుణపాఠం లాంటిదని వారు పేర్కొంటున్నారు.

88 Employees Suspended By Collector In Mahabubnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 88 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన కలెక్టర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: