భూమి పట్టా ఇయ్యలేదని.. వృద్ధురాలు నామినేషన్

హైదరాబాద్: హుజుర్‌నగర్ ఉపఎన్నికకు మొత్తం 119 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి తేదీ కావడంతో పెద్దసంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఆఖరు రోజు ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. కాగా ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పద్మావతి, టిడిపి అభ్యర్ధిగా చావా కిరణ్మయి, బిజెపి నుంచి కోట రామారావు, సిపిఎం అభ్యర్ధిగా పారేపల్లి శేఖరరావు నామినేషన్ దాఖలు […] The post భూమి పట్టా ఇయ్యలేదని.. వృద్ధురాలు నామినేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: హుజుర్‌నగర్ ఉపఎన్నికకు మొత్తం 119 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి తేదీ కావడంతో పెద్దసంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఆఖరు రోజు ర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. కాగా ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా పద్మావతి, టిడిపి అభ్యర్ధిగా చావా కిరణ్మయి, బిజెపి నుంచి కోట రామారావు, సిపిఎం అభ్యర్ధిగా పారేపల్లి శేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇక మంగళవారం నామినేషన్‌ల పరిశీలన చేస్తారు. నామినేషన్‌ల ఉపసంహకరణకు అక్టోబరు 3వ తేదీ వరకు గడువు వుంది. అక్టోబరు 21న పోలింగ్ జరగనుండగా, అక్టోబరు 24న కౌంటింగ్ చేపడుతారు.

85 ఏళ్ల వృద్ధురాలు నామినేషన్

మరోవైపు భూమాఫియా దురాగతాల నుంచి తమను కాపాడలంటూ లక్ష్మీ నర్సమ్మ అనే 85 ఏళ్ల వృద్ధురాలు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసింది. ఈ వయసులో గెలుస్తాననో.. గెలవాలనో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. తన పిల్లల పేరు మీద ఉన్న భూమిని ఇతరులు కబ్జా చేశారని, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌ల దృష్టికి తీసుకెళ్లేందుకే తాను నామినేషన్ వేసినట్లు చెప్పారు. తనకు ప్రభుత్వంపై ఎటువంటి వ్యతిరేకత లేదని, రైతుబంధు లబ్ధిదారులమని ఆమె స్పష్టం చేసింది.

85 year old woman contest in Huzurnagar Bypolls

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post భూమి పట్టా ఇయ్యలేదని.. వృద్ధురాలు నామినేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: