యెమెన్ ఘర్షణలలో 84 మంది బలి

ఖోకా : పశ్చిమాసియాలోని యెమెన్ ఆదివారం ఘర్షణలు, వైమానిక దాడులతో నెత్తురోడింది. దేశంలోని హోడియిడా రెడ్ సీ పోర్టు సిటీలో హింసాకాండ, వైమానిక దాడులలో 84 మంది మృతి చెందారు. ఐరాస మధ్యవర్తిత్వపు చర్చల ప్రక్రియ విఫలం అయిన నేపథ్యంలో ఉన్నట్లుండి తిరిగి ఈ ప్రాంతంలో అంతర్యుద్ధం చెలరేగిందని వెల్లడైంది. హోడియిడా ప్రాంతంలో హౌతి రెబెల్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. శనివారం చర్చలు విఫలం అయిన తరువాత సైనికులు తిరుగుబాటు దార్లకు మధ్య ఘర్షణలు ప్రజ్వరిల్లాయి. 11 మంది […]

ఖోకా : పశ్చిమాసియాలోని యెమెన్ ఆదివారం ఘర్షణలు, వైమానిక దాడులతో నెత్తురోడింది. దేశంలోని హోడియిడా రెడ్ సీ పోర్టు సిటీలో హింసాకాండ, వైమానిక దాడులలో 84 మంది మృతి చెందారు. ఐరాస మధ్యవర్తిత్వపు చర్చల ప్రక్రియ విఫలం అయిన నేపథ్యంలో ఉన్నట్లుండి తిరిగి ఈ ప్రాంతంలో అంతర్యుద్ధం చెలరేగిందని వెల్లడైంది. హోడియిడా ప్రాంతంలో హౌతి రెబెల్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. శనివారం చర్చలు విఫలం అయిన తరువాత సైనికులు తిరుగుబాటు దార్లకు మధ్య ఘర్షణలు ప్రజ్వరిల్లాయి.

11 మంది సైనికులు, 73 మంది తిరుగుబాటుదార్లు ఈ పరస్పర ఘర్షణలలో మృతి చెందినట్లు, పలువురు రెబెల్స్‌తో పాటు సైనికులకు కూడా గాయాలు అయినట్లు వెల్లడైంది. గాయపడ్డ వారిని ఆసుపత్రులలో చేర్చి చికిత్స నిర్వహిస్తున్నారు. యెమెన్‌లో గత మూడేళ్లుగా అంతర్యుద్ధం సాగుతోంది. అధికార స్థాపనకు ఇక్కడ హౌతి తిరుగుబాటుదార్లు , మాజీ దేశాధ్యక్షులు అలీ అబ్దుల్లా సలేహ్ బలగాలతో కలిసి ప్రభుత్వ సేనలతో తలపడుతూ వస్తున్నాయి. దీనితో ఇప్పటికే పలు ప్రాంతాలలో భారీ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లింది.

Comments

comments

Related Stories: