ఈ వయసులోనూ కళాతృష్ణ!

  వృద్ధులు అనగానే ఇంట్లో ఓ మూల కూర్చుని కృష్ణా రామా అనుకుంటారని ఊహించుకుంటాం…ఈ మధ్య కాలంలో చాలా మంది తమలోని ప్రతిభను బయట పెట్టడానికి వయసు అడ్డం కాదని నిరూపిస్తున్నారు. వంటలు చేస్తూ, యోగా చేస్తూ, చదువుకుంటూ… ఇలా రకరకాల పనుల్లో బిజీగా ఉంటున్న వయోవృద్ధులు ఎంతోమంది ఉన్నారు. ఆ కోవకు చెందిన బామ్మే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమారియా జిల్లా లోర్హా గ్రామానికి చెందిన గిరిజన మహిళ జోధయ్య బాయి. 80 ఏళ్ల వయసులో కుంచె […] The post ఈ వయసులోనూ కళాతృష్ణ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వృద్ధులు అనగానే ఇంట్లో ఓ మూల కూర్చుని కృష్ణా రామా అనుకుంటారని ఊహించుకుంటాం…ఈ మధ్య కాలంలో చాలా మంది తమలోని ప్రతిభను బయట పెట్టడానికి వయసు అడ్డం కాదని నిరూపిస్తున్నారు. వంటలు చేస్తూ, యోగా చేస్తూ, చదువుకుంటూ… ఇలా రకరకాల పనుల్లో బిజీగా ఉంటున్న వయోవృద్ధులు ఎంతోమంది ఉన్నారు. ఆ కోవకు చెందిన బామ్మే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉమారియా జిల్లా లోర్హా గ్రామానికి చెందిన గిరిజన మహిళ జోధయ్య బాయి. 80 ఏళ్ల వయసులో కుంచె పట్టుకుని బొమ్మలు గీసేస్తుంది జోధయ్యబాయి. తాజాగా ఈ బామ్మ ఆర్ట్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బామ్మ గీసిన బొమ్మలు ప్రదర్శనకు వెళ్తున్నాయి. ఇటలీలోని మిలాన్‌లో జరుగుతున్న ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ఈమె పెయింటింగ్స్ ప్రదర్శనకు అవకాశం దక్కింది.

జోధయ్య బాయి 40వ యేట ఆమె భర్త మరణించాడు. ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం ఆమె కళపై ఇష్టాన్ని పెంచుకుంది. నాలుగు దశాబ్దాలుగా బొమ్మలు గీయడంతోనే కాలం వెళ్లదీస్తుంది. రకాల జంతువుల బొమ్మలు గీయడంతో పాటు తన చుట్టూ జరిగే ప్రతీ విషయాన్ని కళ రూపంలో తెలియజేస్తుంది. తన పెయింటింగ్ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శితం కాబోతున్నందుకు సంతోషంగా ఉందని చెబుతోంది. ఆమె గురువు గురువు ఆశిష్ స్వామి మాట్లాడుతూ “80 ఏళ్ల వయసులో కూడా ఆమె పెయింటింగ్ పట్ల చూపే శ్రద్ధ అమోఘమని, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తమలోని ప్రతిభను బయటపెట్టొచ్చని, దీనికి ఈ బామ్మే ఆదర్శమని” అంటున్నాడు.

80 Year Old Woman Paintings Displayed In Italy Exhibition

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఈ వయసులోనూ కళాతృష్ణ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: