గోడ కూలి 8 ఏళ్ల బాలిక మృతి…

  నందిపేట : కొత్తగా ఇంట్లో అద్దెకు దిగిన గంటల వ్యవధిలోనే ఆ ఇంటి గోడ కూలడంతో రాపూరి రేణుక(8) అనే బాలిక మృతి చెందిన ఘటన శనివారం నిజామాబాద్ నందిపేట మండలకేంద్రంలో జరిగింది. ప్రకాశం జిల్లా లింగసముందర్ మండ లం ఎర్రేటి పాలెంకు చెందిన రాపూరి అంజయ్య తన కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం మేస్త్రీ పనిచేసేందుకు నందిపేట మండలకేంద్రానికి వచ్చాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మండలకేంద్రంలోని రాజానగర్ దుబ్బ ప్రాంతంలో గల […] The post గోడ కూలి 8 ఏళ్ల బాలిక మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నందిపేట : కొత్తగా ఇంట్లో అద్దెకు దిగిన గంటల వ్యవధిలోనే ఆ ఇంటి గోడ కూలడంతో రాపూరి రేణుక(8) అనే బాలిక మృతి చెందిన ఘటన శనివారం నిజామాబాద్ నందిపేట మండలకేంద్రంలో జరిగింది. ప్రకాశం జిల్లా లింగసముందర్ మండ లం ఎర్రేటి పాలెంకు చెందిన రాపూరి అంజయ్య తన కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం మేస్త్రీ పనిచేసేందుకు నందిపేట మండలకేంద్రానికి వచ్చాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మండలకేంద్రంలోని రాజానగర్ దుబ్బ ప్రాంతంలో గల ఒక ఇంటిలో అద్దెకు దిగారు. కాగా శనివారం ఉదయం కొత్తగా ఇంటిలోకి వచ్చిన వారు ఇంట్లోని సామాను సర్దుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భార్యాభర్తలు అంజయ్య, చెంచమ్మలు ఆరుబయట మెట్ల వద్ద కూర్చున్నారు. ముగ్గురు పిల్లలు ఆర్‌సిసి బిల్డింగ్‌ను ఆనుకుని ఉన్న రేకులషెడ్డుతో గల వంటగదిలో ఆడుకుంటున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన వంటగది రేకులషెడ్డు గోడ ఒక్కసారిగా ముగ్గురిపై కూలింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్న కూతురు రేణుక సంఘటనా స్థలంలోనే మృతి చెందగా గాయపడిన శాంకుమారి, కుమారుడు కొండయ్యలను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటిలో చేరిన మొదటి రోజే కూతురును పోగొట్టుకున్న ఆమె తల్లిదండ్రులు చేసే రోధనలు చూపరులను కదిలించి వేసాయి.

8 year old girl killed as wall collapses

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గోడ కూలి 8 ఏళ్ల బాలిక మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: