నిజామాబాద్ లో కరోనా కలకలం.. 47 పాజిటీవ్ కేసులు నమోదు

నిజామాబాద్: జిల్లాలో గురువారం మరో ఎనిమిది కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 47 కరోనా కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. జిల్లా ప్రజలు భయాందోళన చెందొద్దని, కరోనా కట్టడికి తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దయచేసి ప్రజలెవరూ అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అందరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. ఢిల్లీ మర్కజ్ కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 453 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 11మంది మరణించారు.

8 New Corona Cases Registered in Nizamabad

The post నిజామాబాద్ లో కరోనా కలకలం.. 47 పాజిటీవ్ కేసులు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.