బస్సు లారీ ఢీ: ఎనిమిది మందికి గాయాలు

Accident

 

కరీంనగర్ : ఆగి ఉన్న ఆర్టీసి బస్సును లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు ఎనిమిది మంది ప్రయాణీకులు గాయపడ్డారు. సిఐ తుల శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం… మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసి బస్సు హైదరాబాద్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వద్ద ముందుగా లారీ ఆగి ఉండటంతో బస్సు ముందుకు వెళ్ళేందుకు దారి లేకపోవడంతో డ్రైవర్ లారీ వెనకాల ఆపారు. అదే సమయంలో వెనకాల వస్తున్న లారీ అతివేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో బస్సు ముందుకు వెళ్ళి ఆగి ఉన్న లారీని ఢీకొంది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ గాయపడగా.. బస్సు డోర్‌లు లాక్ కావడంతో ప్రయాణీకులందరూ ఆందోళనకు గురై అరుపులు కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహారించి బస్సు అద్దాలు పగులగొట్టి గాయపడిన ప్రయాణీకులతో పాటు మిగితా వారిని కాపాడారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజబాబుతో పాటు కండక్టర్ అనసూయ, ప్రయాణీకులు రణవీర రవి అతని భార్య శాంతి, నర్సయ్య, సునీల్‌శర్మ, శంకర్, సులోచన సహా లారీ డ్రైవర్ మాధవ్‌లు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ధర్మాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాదంలో గాయపడిన వారు ఏవరికి ఏలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు కరీంనగర్ రూరల్ సిఐ తుల శ్రీనివాస్‌రావు వెల్లడించారు.

8 injured in Bus, Lorry Accident in Karimnagar

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బస్సు లారీ ఢీ: ఎనిమిది మందికి గాయాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.