వృద్ధ మాతకు కవలలు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ (74) అనే వృద్ధురాలు కవల పిల్లలకు జన్మనిచ్చారు. గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌లో మంగాయమ్మ గురువారంనాడు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిం ది. దీంతో మంగాయమ్మ ప్రపంచంలో ఐవిఎఫ్ చేయించుకున్న అతి పెద్ద మహిళగా రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు రాజస్తాన్‌లో దల్జీందర్ పేరిట ఈ రికార్డు ఉంది. దల్జీందర్ 72 ఏళ్ల వయస్సులో మగ బిడ్డకు జన్మనిచ్చా రు. తాజాగా దల్జీందర్ రికార్డును అధిగమించి మంగాయమ్మ కవలలకు […] The post వృద్ధ మాతకు కవలలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన మంగాయమ్మ (74) అనే వృద్ధురాలు కవల పిల్లలకు జన్మనిచ్చారు. గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌లో మంగాయమ్మ గురువారంనాడు ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిం ది. దీంతో మంగాయమ్మ ప్రపంచంలో ఐవిఎఫ్ చేయించుకున్న అతి పెద్ద మహిళగా రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు రాజస్తాన్‌లో దల్జీందర్ పేరిట ఈ రికార్డు ఉంది. దల్జీందర్ 72 ఏళ్ల వయస్సులో మగ బిడ్డకు జన్మనిచ్చా రు. తాజాగా దల్జీందర్ రికార్డును అధిగమించి మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చారు. డాక్టర్ శనక్కాయల అరుణ, ఉమా శంకర్ శస్త్రచికిత్స ద్వారా మంగాయమ్మకు ప్రసవం చేశారు. 1992లో వివాహమైన మంగాయమ్మ ఏళ్లు గడిచినా తల్లి కావాలనే కోరిక తీరలేదు. ఆశలు నెరవేరకుండానే వృద్ధాప్యంలోకి అడుగుపెట్టింది. కాగా తల్లి కావాలనే కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో కృత్రిమ సంతాన సాఫల్య విధానం గురించి తెలుసుకున్న మంగాయమ్మ ఐవిఎఫ్ పద్దతిని ఆశ్రయించింది. గడిచిన నవంబరులో గుంటూరులోని అహల్య నర్సింగ్ హోమ్‌ను సంప్రదించింది. మంగాయమ్మకు బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలేవీ లేకపోవడంతో వైద్యులు ఆమెకు సంతాన సాఫల్య చికిత్స ప్రారంభించారు. మొదటి సైకిల్‌లోనే వైద్యుల కృషి ఫలించి మంగాయమ్మ గర్భం ధరించింది. నేడు పండంటి శిశువులకు జన్మనిచ్చింది.

 

74YearOld Andhra Woman Gives Birth to Twins

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వృద్ధ మాతకు కవలలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.