మరణాల్లో చైనాను దాటేసిన భారత్

  కరోనా కేసుల్లో ప్రపంచంలో 9వ స్థానానికి చేరిక 24 గంటల్లో 7 వేలకు పైగా కేసులు,175 మరణాలు ఇప్పటివరకు 34,83,838 శాంపిల్స్ పరీక్ష: ఐసిఎంఆర్ న్యూఢిల్లీ: చైనాలో పుట్టిప్రపంచ దేశాలన్నిటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోను శరవేగంగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7466 కేసులు, 175 మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,706కు చేరినట్లు కేం ద్ర ఆరోగ్య, […] The post మరణాల్లో చైనాను దాటేసిన భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా కేసుల్లో ప్రపంచంలో 9వ స్థానానికి చేరిక
24 గంటల్లో 7 వేలకు పైగా కేసులు,175 మరణాలు
ఇప్పటివరకు 34,83,838 శాంపిల్స్ పరీక్ష: ఐసిఎంఆర్

న్యూఢిల్లీ: చైనాలో పుట్టిప్రపంచ దేశాలన్నిటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లోను శరవేగంగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7466 కేసులు, 175 మరణాలు చోటు చేసుకున్నాయి.

దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,65,799కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 4,706కు చేరినట్లు కేం ద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో కరోనా వైరస్ బైటపడ్డ తర్వాత 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. కాగా కరోనా మరణాల్లో భారత్ చైనాను దాటేసింది. చైనాలో ఇప్పటివరకు 4,634 మరణాలు సంభవించగా, భారత్‌లో ఈ సంఖ్య 4,706గా ఉండడం దేశంలో ఈ వైరస్ తీవ్రతకు అద్ద పడుతోంది.అంతేకాకుండా కరోనా కేసుల్లోను భారత్ 9వ స్థానానికి ఎగబాకింది. లక్షా 82 వేల కేసులతో జర్మనీ 8వ స్థానంలో ఉండగా లక్షా 60 వేల కేసులతో టరీ పదో స్థానంలో ఉంది. అంతేకాదు చైనాతో పోలిస్తే భారత్‌లో రెట్టింపు కేసులు నమోదైనాయి.

చైనాలో ఇప్పటివరకు 84, 106 కేసులు నమోదు కాగా భారత్‌లో ఈ రోజు వరకు 1,65,799 కేసులు నమోదైనాయి. ఇదిలా ఉండగా దేశంలోని మొత్తం కేసు ల్లో ఇప్పటివరకు 71,105 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా, 89,987 మంది చికిత్స పొందుతున్నారు. అంటే రికవరీ రేటు 42.89 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరో వైపు ఇప్పటివరకు 34,83,838 శాంపిల్స్‌ను పరీక్షించడం జరిగిందని, గడచిన 24 గంటల్లో 1,21,702 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) తెలిపింది.

గడచిన 24 గంటల్లో సంభవించిన మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే 85 ఉన్నాయి. గుజరాత్‌లో 22, యుపిలో 15, ఢిల్లీలో 13, తమిళనాడులో 12,మధ్యప్రదేశ్‌లో 8, రాజస్థాన్‌లో 7 మరణాలు చోటు చేసుకున్నా యి. ఇదిలా ఉండగా దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 59,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా19, 372 కేసులతో తమిళనాడు ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఢిల్లీలో 16,281, గుజరాత్‌లో 15,562, రాజస్థాన్‌లో 8,067, మధ్య ప్రదేశ్‌లో 7,453, ఉత్తరప్రదేశ్‌లో 7,170 పాజిటివ్ కేసులున్నాయి.

పోలీసులను వదలని మహమ్మారి
మహారాష్ట్ర పోలీసు శాఖను కరోనా మహమ్మారి వణికిస్తోంది. గడచిన 24 గంటల్లో 116మంది పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా గా ముగ్గురు పోలీసులు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2215 మంది పోలీసులు కరోనా బారిన పడగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికి పాజిటివ్
ఢిల్లీ పార్లమెంటు భవనంలోని రాజ్యసభ సెక్రటేరియట్‌లో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. డైరెక్టర్ స్థాయి అధికారి అయిన ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ వైరస్ సోకినట్లు అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ఆయన గురువారం కూడా విధులకు హాజరైనారు. దీంతో అప్రమత్తమైన అధికారులుపార్లమెంటులోని అనెక్స్ భవనాన్ని మూసివేశారు. ఈ భవనంలో ఇది రెండో కేసు కావడం గమనార్హం. భవనాన్ని శానిటైజ్ చేసిన తర్వాత తెరవనున్నట్లు సమాచారం.

కర్నాటకలో మరో 248 కేసులు
కర్నాటకలో గత 24 గంటల్లో 248 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కేసుల సంఖ్య 2,781కి చేరింది. ఇందులో 48 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

7466 Coronavirus Cases In India In 24 Hours 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మరణాల్లో చైనాను దాటేసిన భారత్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: