స్వల్ప జరిమానాతో తబ్లీగీ కేసు విముక్తి

73 Tablighis from abroad released

 

న్యూఢిల్లీః తబ్లీగీ జమాతే కేసులో 62మంది మలేసియన్లు, 11మంది సౌదీ అరేబియన్లకు స్వల్ప జరిమానాతో విడుదల చేయడానికి ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు అంగీకరించింది. మలేసియన్లు రూ.7 వేలు, సౌదీ అరేబియన్లు రూ.10 వేల చొప్పున జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కొవిడ్-19 లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో మతపరమైన సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలను ఉల్లంఘించినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఫిర్యాదిదారులైన లజ్‌పత్‌నగర్ మెజిస్ట్రేట్, అదనపు కమిషనర్, నిజాముద్దీన్ ఇన్‌స్పెక్టర్‌లు నిందితులను విడుదల చేయడానికి అంగీకరించడంతో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వారి విడుదలకు ఆదేశాలిచ్చారు.

73 Tablighis from abroad released

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post స్వల్ప జరిమానాతో తబ్లీగీ కేసు విముక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.