జమ్మూలో ప్రశాంతత.. కశ్మీర్‌లో ఆంక్షలు

జెండా పండుగకు సర్వం సిద్ధం భారీగా భద్రతా బలగాల మోహరింపు శ్రీనగర్: జమ్మూ పరిస్థితి క్రమేపీ కుదుటపడుతోంది. దీనితో ఈ ప్రాంతమంతటా బుధవారం నుంచి ఆంక్షలను ఎత్తివేశారు. అయితే కశ్మీర్ లోయలో కొన్ని చోట్ల నియంత్రణలు ఉంటాయని అదనపు డిజి మునీర్ ఖాన్ తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన విలేకరులకు తెలిపారు. కశ్మీర్‌లో ముందుజాగ్రత్త చర్యగా కొన్ని చోట్ల జాగ్రత్తలు చేపట్టినట్లు వివరించారు. లోయలోనూ, శ్రీనగర్‌లోని వివిధ ప్రాంతాలలో స్వల్ప ఘటనలు జరిగినట్లు, వాటిని […] The post జమ్మూలో ప్రశాంతత.. కశ్మీర్‌లో ఆంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జెండా పండుగకు సర్వం సిద్ధం

భారీగా భద్రతా బలగాల మోహరింపు

శ్రీనగర్: జమ్మూ పరిస్థితి క్రమేపీ కుదుటపడుతోంది. దీనితో ఈ ప్రాంతమంతటా బుధవారం నుంచి ఆంక్షలను ఎత్తివేశారు. అయితే కశ్మీర్ లోయలో కొన్ని చోట్ల నియంత్రణలు ఉంటాయని అదనపు డిజి మునీర్ ఖాన్ తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఆయన విలేకరులకు తెలిపారు. కశ్మీర్‌లో ముందుజాగ్రత్త చర్యగా కొన్ని చోట్ల జాగ్రత్తలు చేపట్టినట్లు వివరించారు. లోయలోనూ, శ్రీనగర్‌లోని వివిధ ప్రాంతాలలో స్వల్ప ఘటనలు జరిగినట్లు, వాటిని అక్కడికక్కడనే చక్కదిద్దినట్లు తెలిపారు. ఘర్షణలలో ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని విలేకరుల సమావేశంలో తెలిపారు. కొందరికి పెల్లెట్ గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరులకు ఇబ్బంది కలుగకూడదని, ప్రాణనష్టం జరగకూడదనేదే తమ సంకల్పం అని తెలిపారు. జమ్మూ అంతా ప్రశాంతంగా ఉందన్నారు. అక్కడ విద్యాసంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎంత మందిని నిర్బంధంలోకి తీసుకున్నారనే ప్రశ్నకు ఆయన స్పందించలేదు. ముందు జాగ్రత్త చర్యల లో భాగంగా కొందరిని నిర్బంధంలోకి తీసుకున్న ట్లు, డిటెన్షన్‌లలో పలు రకాలు ఉంటాయని వివరించారు. గురువారం నాటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరగడంపైనే పోలీసు వ్యవస్థ అంతా దృష్టి సారించిందని అన్నారు. విలేకరుల సమావేశంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యకార్యదర్శి రోహిత్ కన్సల్ కూడా మాట్లాడారు. రాష్ట్రం లో మొత్తం మీద పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. కశ్మీర్ లోయలో ఏదో జరిగిపోతోందని పాకిస్థాన్ పనిగట్టుకుని దష్ప్రచారానికి దిగుతోందని, వారికి ఇది అలవాటే అని విమర్శించారు. ఇక తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న ట్విట్టర్ అకౌంట్లను గుర్తించినట్లు వాటిపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
జెండా పండుగకు కశ్మీర్ గవర్నర్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ జాతీ య జెండా ఎగురవేస్తారు. శ్రీనగర్‌లోని షేర్ ఎ కశ్మీర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం కోసం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేపట్టారని రాష్ట్ర ముఖ్యకార్యదర్శి రోహిత్ కన్సల్ విలేకరులకు తెలిపారు. ఇక జమ్మూలో గవర్నర్ సలహదారులు ఒకరు స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. అన్ని స్థాయిలలోనూ పంద్రాగస్టు వేడుకుల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు వివరించారు.

73 Independence day arrangements in Jammu Kashmir

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జమ్మూలో ప్రశాంతత.. కశ్మీర్‌లో ఆంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: