వేతనాలు, ఉద్యోగాల కోత ఉండదు

  కార్మికులకు ప్రముఖ కార్పొరేట్ సంస్థల అభయం ఒక్క ఉద్యోగినైనా తొలగించడానికి ముందు నా జీతాన్ని జీరోకు తగ్గించుకుంటా – రాజీవ్ బజాజ్, బజాజ్ ఆటో సిఇఓ, ఎండి మా కార్యాలయాలు, సైట్‌లలో పని చేసే తాత్కాలిక వర్కర్లు, దినసరి కూలీలకు పూర్తి వేతనాలను చెల్లిస్తాం– ఎన్ ద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్ ఈ క్లిష్ట సమయంలో వ్యాపారంకన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యం – హెచ్ ఎం బంగూర్, చైర్మన్, శ్రీసిమెంట్స్ ముంబయి : కాగా కరోనా […] The post వేతనాలు, ఉద్యోగాల కోత ఉండదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కార్మికులకు ప్రముఖ కార్పొరేట్ సంస్థల అభయం

ఒక్క ఉద్యోగినైనా తొలగించడానికి ముందు నా జీతాన్ని జీరోకు తగ్గించుకుంటా – రాజీవ్ బజాజ్, బజాజ్ ఆటో సిఇఓ, ఎండి

మా కార్యాలయాలు, సైట్‌లలో పని చేసే తాత్కాలిక వర్కర్లు, దినసరి కూలీలకు పూర్తి వేతనాలను చెల్లిస్తాం ఎన్ ద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్

ఈ క్లిష్ట సమయంలో వ్యాపారంకన్నా ప్రజల ప్రాణాలే ముఖ్యం – హెచ్ ఎం బంగూర్, చైర్మన్, శ్రీసిమెంట్స్

ముంబయి : కాగా కరోనా భయం కారణంగా ఉత్పత్తి తగ్గి పోవడం, ఆదాయాలు లేక పోవడంతో కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల జీతాలతో పాటు ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించుకుంటాయేమోనన్న భయాలు వ్యక్తమవుతున్నాయి, ఇండిగో ఎయిర్‌లైన్స్, అపోలో టైర్స్ ప్రమోటర్లు ఉద్యోగుల వేతనాల్లో 25 శాతం దాకా కోత విధించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ భయాలు మరింత ఎక్కువయ్యాయి. అయితే అలాంటి భయాలేమీ అక్కర లేదని, ఒక్క కార్మికుడిని కూడా తొలగించబోమని ఆదిత్య బిర్లా గ్రూపు, టాటా సన్స్, బజాజ్ ఆటో లాంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు స్పష్టం చేశాయి. ‘ఒక్క ఉద్యోగినైనా తొలగించడానికి ముందు నేను నా జీతాన్ని జీరో శాతానికి తగ్గించుకుంటాను’ అని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ రాజీవ్ బజాజ్ ఒక టీవీ ఇంటర్వూలో స్పష్టం చేశారు.

ఉద్యోగాల్లో ఎలాంటి కోతా ఉండదని, వారి జీతల్లో కూడా కోత విధించబోమని ఆదిత్య బిర్లా గ్రూపు, వేదాంత గ్రూపు, ఎస్సార్ గ్రూపు లాంటి ప్రముఖ కంపెనీలు ప్రకటించాయి. ఇక కార్లనుంచి ఉప్పు దాకా అన్ని రంగాలకు విస్తరించిన టాటా సన్స్ గ్రూపు చైర్మన్ ఎన్ చంద్ర శేఖరన్ అయితే మరో అడుగు ముందుకు వేసి, మార్చి, ఏప్రిల్ నెల్లకు దేశవ్యాప్తంగా తమ సంస్థల్లో పని చేసే తాత్కాలిక సిబ్బంది, దినసరి వేతన కార్మికులకు పూర్తి వేతనాలు లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. పేటిఎం సిఇఓ శేఖర్ శర్మ అయితే తాను ఈ నెల, వచ్చే నెల జీతం తీసుకోబోనని, ఆ సొమ్మును పేటిఎం కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగుల అవసరాలు తీర్చడానికి ఖర్చు చేస్తానని చెప్పారు. మారియట్ గ్రూపు హోటళ్లు, కాడిల్లా హెల్త్ కేర్, మారికో.. ఇలా అన్ని రంగాలకు చెందిన కంపెనీలు సైతం వ్యాపారం అన్న తర్వాత లాభం, నష్టం రెండూ ఉంటాయని, కష్టకాలంలో ఉద్యోగుల కడుపు కొట్టే నిర్ణయాలు తీసుకోబోమని చెప్పడం శుభ పరిణామమే.

50% కంపెనీలపై కరోనా ప్రభావం : ఫిక్కీ
దేవీయంగా 50 శాతం కంపెనీలపై కరోనా వైరస్ ప్రభావం పడినట్లు భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య(ఫిక్కీ) తాజాగా నిర్వహించిన ఓ సర్వేలోతేలింది. అది కూడా ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలిసింది. అలాగే సుమారు 80 శాతం కంపెనీలకు నగదు లభ్యత తగ్గినట్లు కూడా సర్వే తెలిపింది. దీంతో కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు, వడ్డీలు, రుణాల చెల్లింపులు వంటివి చేయలేని పరిస్థితి నెలకొంటోందని తెలిపింది. కరోనా వైరస్ సరఫరా, గిరాకీ రెండింటికీ తీవ్ర అంతరాయం సృష్టించిందని, దేశ వృద్ధి పథానికి ఇది అవరోధంగా నిలుస్తోందని తెలిపింది. ఈ సంక్షోభంనుంచి వ్యాపార సంస్థలు బైటపడాలంటే.. పరపతి విధాన నిర్ణయాలతో పాటుగా ఆర్థిక పరమైన సహకారాన్ని ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉందని ఆ సర్వేఅభిప్రాయపడింది.

73% businesses report big reduction in orders, says FICCI

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వేతనాలు, ఉద్యోగాల కోత ఉండదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: