ఆదిలాబాద్ లో 71.45 శాతం పోలింగ్ నమోదు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 71.45 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగడం, పోలింగ్ సిబ్బంది రిసెప్షన్ కేంద్రాలకు వచ్చేందుకు ఆలస్యం కావడంతో శుక్రవారం మద్యాహ్నం అధికారికంగా పోలింగ్ శాతాన్ని వెల్లడించారు. సిర్పూర్ నియోజకవర్గంలో 2,03,165 మందికి గాను 1,41,232 మంది ఓట్లు వేశారు. 71,944 మంది పురుషులు, 69,287 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా, 69.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో […] The post ఆదిలాబాద్ లో 71.45 శాతం పోలింగ్ నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 71.45 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం వరకు పోలింగ్ కొనసాగడం, పోలింగ్ సిబ్బంది రిసెప్షన్ కేంద్రాలకు వచ్చేందుకు ఆలస్యం కావడంతో శుక్రవారం మద్యాహ్నం అధికారికంగా పోలింగ్ శాతాన్ని వెల్లడించారు. సిర్పూర్ నియోజకవర్గంలో 2,03,165 మందికి గాను 1,41,232 మంది ఓట్లు వేశారు. 71,944 మంది పురుషులు, 69,287 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా, 69.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 1,99,498 మందికి గాను 1,47,643 మంది ఓట్లు వేశారు. 75,425 మంది పురుషులు, 72,215 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా, 74.01 శాతం పోలింగ్ నమోదైంది. ఖానాపూర్ నియోజకవర్గంలో 2,03,746 మందికి గాను 1,44,986 మంది ఓట్లు వేశారు. 68,785 మంది పురుషులు, 76,195 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా, 71.16 శాతం పోలింగ్ నమోదైంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,19,612 మందికి గాను 1,54,446 మంది ఓట్లు వేశారు. 78,807 మంది పురుషులు, 75,638 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా, 70.33 శాతం పోలింగ్ నమోదైంది. బోథ్ నియోజకవర్గంలో 1,93,373 మందికి గాను 1,47,137 మంది ఓట్లు వేశారు. 73,632 మంది పురుషులు, 73,505 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా, 76.09 శాతం పోలింగ్ నమోదైంది. నిర్మల్ నియోజకవర్గంలో 2,38,371 మందికి గాను 1,59,531 మంది ఓట్లు వేశారు. 72,301 మంది పురుషులు, 86,635 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా, 66.93 శాతం పోలింగ్ నమోదైంది. ముధోల్ నియోజకవర్గంలో 2,30,588 మందికి గాను 1,68,464 మంది ఓట్లు వేశారు. 82,075 మంది పురుషులు, 86,387 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా, 73.45 శాతం పోలింగ్ నమోదైంది. అన్ని నియోజకవర్గాలలోనూ పోలింగ్ శాతం గణనీయంగా తగ్గడానికి ఎండల తీవ్రతే ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఎండలో, ఉక్కపోతలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసి రావడం కొంత ఇబ్బందికరంగా మారడంతో కొంత మంది ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయారు. అయితే 2014 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం పెరగడం శుభపరిణామంగా చెప్పవచ్చు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆదిలాబాద్ లో 71.45 శాతం పోలింగ్ నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: