ఎపిలో కొత్తగా 704 కేసులు.. ఏడుగురు మృతి

704 New Corona Cases Reported in AP

అమరావతిః ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో 704 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని, కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో ఎపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,595కు చేరింది. ఇక, కరోనాతో ఇప్పటివరకు 187మంది బాధితులు ప్రణాలు కోల్పోయారు. విదేశాల నుంచి ఎపికి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ కాగా, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన 51 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 7,897 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 6,511 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 18, 114 కరోనా పరీక్షలు చేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,190 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది.

704 New Corona Cases Reported in AP

The post ఎపిలో కొత్తగా 704 కేసులు.. ఏడుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.