70 లక్షల కోట్లకు డిజిటల్ పేమెంట్లు

By 2023, India Payment Market is worth Rs 70 lakh crore

2023 సంవత్సరం నాటికి భారత్ పేమెంట్ మార్కెట్ విలువ
క్రెడిట్ సుసీ గ్రూప్ అంచనా

న్యూఢిల్లీ: డీమానిటైజేషన్(నోట్ల రద్దు) నిర్ణయం అనంతరం దేశంలో ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఆ తర్వాత కొన్ని నెలలు తగ్గుముఖం పట్టినా, 2018లో డిజిటల్ పేమెంట్ల వృద్ధి వేగవంతమైంది. కొత్త యాప్‌లు వచ్చిన తర్వాత ఈ డిజిటల్ పేమెంట్లు మరింత మెరుగయ్యాయి. ఈ యాప్‌లు డిస్కౌంట్లు, క్యాష్ బోనస్‌లతో ప్రజలను ఆకర్షించి, వారిని డిజిటల్ పేమెంట్ల వైపు మళ్లించాయి. . ప్రస్తుతం ఇది రూ.14 లక్షల కోట్ల మార్కెట్‌ను కలిగి ఉంది. ఇప్పటికీ దేశంలో 70 శాతం లావాదేవీలు నగదు ద్వారానే జరుగుతున్నాయని క్రెడిట్ సుకీ తెలిపింది. పొరుగు దేశం చైనా ఈ విషయంలో అత్యంత ముందుంది. చైనాలో మొబైల్ పేమెంట్ల మార్కెట్ రూ.350 లక్షల కోట్లుగా ఉంది. అయితే చైనాలో స్థానిక సంస్థలే డిజిటల్ పేమెంట్లలో ఉన్నాయి. భారత్‌లో నరేంద్ర మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు స్వాగతం పలకడం ద్వారా భారత్‌లో ఆర్థిక సేవలను మరింత విస్తృతం చేసింది. ‘ఈ రకమైన మార్కెట్ ఎక్కడా లేద’ని ఫైనాన్షియల్ టెక్నాలజీకి చెందిన కన్సల్టెన్సీ పిడబ్లుసి ఇండియా ప్రతినిధి వివేక్  బెల్గావి అన్నారు. దేశంలో వీటి కోసం అనేక యాప్‌లు వేలిశాయి. ప్రధానంగా భీమ్, పేటిఎం, పోన్ పే, జి పే, వాట్సాప్ పెమెంట్లు వంటి ఉన్నాయి. వీటి మధ్య పోటీ వాతావరణం ఎక్కువగా ఉంది. వచ్చే సంవత్సరాల్లో మొబైల్ యాప్‌ల ద్వారా పేమెంట్లు పెరిగే అవకాశముందని, ఇంకా పేమెంట్ యాప్‌లు కూడా రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.