కరీంనగర్‌లో కరోనా కలకలం…

ఇండోనేషియా బృందం పర్యటనతో జిల్లా కేంద్రంలో హైఅలర్ట్ వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించాలి : మంత్రి గంగుల కరీంనగర్ : కరీంనగర్ ప్రజలు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ జాగ్రత్తలపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14వ ఇండోనేషియా నుంచి 12 మంది మత ప్రచారకులు కరీంనగర్ పట్టణానికి వచ్చారని, వారిని వైద్యపరీక్షలు నిమిత్తం […] The post కరీంనగర్‌లో కరోనా కలకలం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఇండోనేషియా బృందం పర్యటనతో జిల్లా కేంద్రంలో హైఅలర్ట్
వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించాలి : మంత్రి గంగుల

కరీంనగర్ : కరీంనగర్ ప్రజలు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరోనా వైరస్ జాగ్రత్తలపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 14వ ఇండోనేషియా నుంచి 12 మంది మత ప్రచారకులు కరీంనగర్ పట్టణానికి వచ్చారని, వారిని వైద్యపరీక్షలు నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపించామని మంత్రి అన్నారు. కరీంనగర్‌లో కరోనా వైరస్ కనిపించినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప, ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు. మత ప్రచారకులు సంచరించిన కలెక్టరేట్ ప్రాంతానికి 3 కి.మీ పరిధిలోని ప్రతి ఇంట్లోని వ్యక్తులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. గుంపులుగా గుమికూడవద్దని, ప్రార్థనా మందిరాలకు, దేవాలయాలకు వెళ్లవద్దని మంత్రి కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇంటికే పరిమితం కావాలని అన్నారు. మొత్తం 100 బృందాలతో కరీంనగర్ పట్టణంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో మేయర్ సునీల్‌రావు, కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్‌రెడ్డి, అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డిఎంహెచ్‌వో సుజాత తదితరులు పాల్గొన్నారు.

7 Indonesians test positive for coronavirus in Telangana

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరీంనగర్‌లో కరోనా కలకలం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: