68,500 కోట్ల అదనపు భారం

Domestic currency rupee has fallen by over 11 per cent

వచ్చే నెలల్లో మరింతగా పెరనున్న విదేశీ రుణాలు
డాలర్‌పై రూపాయి పతనమే కారణం
ఇప్పటి వరకు రూపాయి 11 శాతా నికి పైగా పతనం
ఎస్‌బిఐ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి భారీ పతనంతో విదేశీ రుణ భారం మరింతగా పెరగనుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దేశీయ కరెన్సీ రూపాయి 11 శాతానికి పైగా పతనమైంది. ఈ కారణంగా రూ.68,500 కోట్లు (9.5 బిలియన్ డాలర్లు) అదనపు భారం పడనుందని, వచ్చే నెలల్లో ఈ రుణం చెల్లించాల్సి ఉంటుందని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నివేదిక తెలిపింది. వర్ధమాన దేశాల్లో కరెన్సీల పతనం నేపథ్యంలో గురువారం రూపాయి చారిత్రక కనిష్ట స్థాయి 72కు పడిపోయింది. దీంతో కరెంట్ ఖాతా లోటు పెరిగింది. ఈ ఏడాదిలో రూపాయి 73కు పతనమైతే.. క్రూడ్ ఆయిల్‌ను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంటున్న భారత్‌కు మరింత భారం పడనుంది. ఈ ఏడాదిలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 76 డాలర్ల వద్ద దిగుమతి బిల్లు రూ.45,700 కోట్లకు చేరనుందని ఎస్‌బిఐ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. 2017 సంవత్సరంలో భారత్ స్వల్పకాలిక రుణాలు మొత్తం 217.6 బిలియన్ డాలర్లు ఉన్నాయి.

డాలర్ సగటున 65.1 రూపాయల వద్ద 50 శాతం రుణం 2018 ప్రథమార్థంలో చెల్లిస్తారు. మిగతా రుణం మారకం విలువ 65.1 (డాలర్‌కు) వద్ద లెక్కిస్తే రూ.7.1 లక్షల కోట్లు అ వుతుంది. గత మూడు నెలల్లో రూపాయి 11 శాతం క్షీ ణించింది. ఈ లెక్కన చూస్తే విదేశీ రుణాల మొత్తం ఇప్పు డు రూ.7.8 లక్షల కోట్లకు చేరనుంది. అంటే ప్రభుత్వ ఖ జానాపై దాదాపు రూ.70 వేల కోట్ల మేరకు అదనపు భా రం పడనుంది. ‘ఈ ఏడాది ద్వితీయార్థానికి గాను రూ పాయి క్షీణత సగటున డాలరుతో పోలిస్తే 71.4 వద్ద ఉం ది. ఈ కారణంగా ప్రభుత్వానికి రుణ భారం రూ.7.8 లక్షల కోట్లకు చేరనుంది’ అని ఘోష్ అన్నారు. డాలర్‌తో రూపాయి సగటున 73 డాలర్లకు చేరినట్లయితే ఈ ఏడా ది ఆఖరు నాటికి చమురు బిల్లు గణనీయంగా పెరగనుంది. ఈ పర్యవసానంగా భారత్ రుణాలు కూడా మరింతగా పెరగనున్నాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ సగటున 76 డాలర్లు ఉంది. రూపాయి, క్రూడ్ ఆయిల్‌ల కారణంగా ఆయిల్ బిల్లు రూ.45,700 కోట్లకు చేరనుంది.

Comments

comments