ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు 603 మంది వచ్చారు: జిహెచ్ఎంసి కమిషనర్

Lokesh Kumar

 

హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో 603 మంది పాల్గొని నగరానికి వచ్చారని జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. వారి ఆరోగ్య స్థితిని తనిఖీ చేసేందుకు 200 బృందాలు జిహెచ్‌ఎంసి పరిధిలో పని చేస్తున్నాయన్నారు. తనిఖీ ప్రక్రియను జోనల్ కమిషనర్లు మానిటరింగ్ చేస్తున్నారని, ఇవాళ 463 ఇండ్లను తనిఖీ చేశారని, ఆరోగ్య సమస్యలు ఉన్న 74 మందిని గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలించామన్నారు. 348 మందిని హోంక్యారంటైన్ చేయగా మరో 41 మందిని ప్రభుత్వం క్యారంటైన్‌కు తరలించామని సోమేష్ కుమార్ తెలిపారు.

 

603 Members came to Hyderabad from Delhi

 

603 Members came to Hyderabad from Delhi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు 603 మంది వచ్చారు: జిహెచ్ఎంసి కమిషనర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.