న్యూఢిల్లీ: రైల్వేశాఖను నూతన టెక్నాలజీతో ఆధునీకరించనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. రానున్న ఆరు నెలల్లో 6వేల రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందుబాటులోకి తీసుకురానున్నామని పియుష్ గోయల్ చెప్పారు. మంగళవారం జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను దేశం మొత్తం విస్తరించి సాంకేతికతను మారుమూల గ్రామాలకు కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు. కేబుల్ పనులను వచ్చే ఎనిమిది నుంచి ఆరు నెలల్లో పూర్తి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. 74 శాతం రైల్వే స్టేషన్లలో ఇప్పటికే సాంకేతికంగా అభివృద్ధి చేసి కంప్యూటీకరించినట్లు పియుష్ గోయల్ పేర్కొన్నారు.