ఆర్యవైశ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 60 మంది ఆర్యవైశ్యులు టిఆర్‌ఎస్‌లో చేరిక మన తెలంగాణ/వనపర్తి : పేద ఆర్యవైశ్యులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆర్యవైశ్య వాసవిక్లబ్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్‌శెట్టి ఆధ్వర్యంలో 60 మంది ఆర్యవైశ్యులు నిరంజన్‌రెడ్డి సమక్షం లో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి టిఆర్‌ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిం చారు. వనపర్తి జిల్లా […]

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
60 మంది ఆర్యవైశ్యులు టిఆర్‌ఎస్‌లో చేరిక

మన తెలంగాణ/వనపర్తి : పేద ఆర్యవైశ్యులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆర్యవైశ్య వాసవిక్లబ్ సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్‌శెట్టి ఆధ్వర్యంలో 60 మంది ఆర్యవైశ్యులు నిరంజన్‌రెడ్డి సమక్షం లో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి టిఆర్‌ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిం చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య భవనాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వంలోని ప్రతి సంక్షేమ పథకాన్ని ఆర్యవైశ్యులు సద్వినియోగం చేసుకోవాలని , పార్టీలకు అతీతంగా టిఆర్‌ఎస్‌లో చేరి సిఎం కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, పట్టణాధ్యక్షులు గట్టుయాదవ్, కౌన్సిలర్లు వాకిటి శ్రీధర్, ఆవుల రమేష్, పాకనాటి కృష్ణ, సతీష్ యాదవ్, పి.డికమలమ్మ, ఇందిరమ్మ, నందిమల్ల భువనేశ్వరి, టిఆర్‌ఎస్ నాయకులు దాడి యోగా నంద్ రెడ్డి, నందిమల్ల శ్యాం. అజీజ్‌ఖాన్, జిజె.శ్రీనివాసులు, మురళీసాగర్, శ్రీనివాస్‌యాదవ్, విష్ణుసాగర్, ఎండి. జహంగీర్, బీచుపల్లి యాదవ్, చిట్యాల రాము, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Stories: