మోహర్రం వేడుకల్లో బాలుడికి తగిలిన బుల్లెట్

  కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మల్దా ప్రాంతంలోని సహాపూర్‌లో మోహర్రం వేడుకలో బాలుడికి బుల్లెట్ తగిలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షేక్ అప్సర్ అనే వ్యక్తి తన కుమారుడు అబ్దుల్ రజాక్‌ను మొహరం వేడుకలలో జరిగే ర్యాలీని చూసేందుకు ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ర్యాలీని చూస్తుండగా బాలుడికి బుల్లెట్ తగిలి కిందపడిపోయాడు. అబ్దుల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఛాతి కింద భాగంలో బుల్లెట్ తగలడంలో బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పెద్ద ఆస్పత్రికి […] The post మోహర్రం వేడుకల్లో బాలుడికి తగిలిన బుల్లెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మల్దా ప్రాంతంలోని సహాపూర్‌లో మోహర్రం వేడుకలో బాలుడికి బుల్లెట్ తగిలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షేక్ అప్సర్ అనే వ్యక్తి తన కుమారుడు అబ్దుల్ రజాక్‌ను మొహరం వేడుకలలో జరిగే ర్యాలీని చూసేందుకు ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. ర్యాలీని చూస్తుండగా బాలుడికి బుల్లెట్ తగిలి కిందపడిపోయాడు. అబ్దుల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఛాతి కింద భాగంలో బుల్లెట్ తగలడంలో బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు తండ్రికి సూచించారు. ప్రస్తుతం మల్దాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. షేక్ అప్సర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు వీడియోలు తీశారని నిందితులను పట్టుకుంటామని పోలీస్ అధికారి సజల్ కాంతి బిశ్వాస్ తెలిపారు. మోహరం ర్యాలీలో గన్‌తో కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2016లో కాలిచాక్ ప్రాంతంలో మోహరం ర్యాలీలో కాల్పులు జరపడంతో కొందరు గాయపడ్డారు. అప్పటి నుంచి ర్యాలీలో పైరింగ్, కత్తులను ఉపయోగించవద్దని పోలీసులు నిషేధించారు.

 

Boy Hit by Bullets during Muharram in West Bengal

The post మోహర్రం వేడుకల్లో బాలుడికి తగిలిన బుల్లెట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: