పేలిన గ్యాస్ ట్యాంకర్.. ఆరుగురు మృతి…

లక్నో: పెట్రోల్ కెమికల్ ఫ్యాక్టరీలోని గ్యాస్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు పేలిపోవడంతో ఆరుగురు మృతి చెందిన విషాద సంఘటన యుపిలోని బిజ్నూర్ జిల్లా నగినారోడ్ లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మీథేన్ గ్యాస్ ట్యాంకును మరమ్మతు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు […]

లక్నో: పెట్రోల్ కెమికల్ ఫ్యాక్టరీలోని గ్యాస్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు పేలిపోవడంతో ఆరుగురు మృతి చెందిన విషాద సంఘటన యుపిలోని బిజ్నూర్ జిల్లా నగినారోడ్ లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో 8 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మీథేన్ గ్యాస్ ట్యాంకును మరమ్మతు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments

Related Stories: