పానీపూరి తిని 50 మందికి అస్వస్థత

  ఆదిలాబాద్: పానీ పూరి తిని పట్టణం పరిధిలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన 50 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ కాలనీలో పానీపూరి అమ్మేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. చిన్నారులు చాలా రోజుల తర్వాత పానీపూరి బండి కనబడటంతో తినడానికి ఎగబడ్డారు. ఈ క్రమంలో పానీపూరి తిన్న చిన్నారులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురయ్యారు. వీరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బలరాంనాయక్ తన సిబ్బందితో కలిసి చిన్నారులకు చికిత్స […] The post పానీపూరి తిని 50 మందికి అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిలాబాద్: పానీ పూరి తిని పట్టణం పరిధిలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన 50 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ కాలనీలో పానీపూరి అమ్మేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. చిన్నారులు చాలా రోజుల తర్వాత పానీపూరి బండి కనబడటంతో తినడానికి ఎగబడ్డారు.

ఈ క్రమంలో పానీపూరి తిన్న చిన్నారులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురయ్యారు. వీరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బలరాంనాయక్ తన సిబ్బందితో కలిసి చిన్నారులకు చికిత్స అందించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎటువంటి విషమ పరిస్థితి లేదని బలరాంనాయక్ తెలిపారు. పానీపూరి అమ్మిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

40 peoples fall ill after having pani puri in adilabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పానీపూరి తిని 50 మందికి అస్వస్థత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: