బాబు ప్రాణం తీసిన దంపతుల గొడవ

ఢిల్లీ: దంపతుల మధ్య గొడవలో ఐదు నెలల పసివాడి ప్రాణం పోయిన సంఘటన ఢిల్లీలోని కొండ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సత్యజిత్(32), దీప్తి(29) అనే దంపతులు మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు గొడవకు దిగారు. దీంతో దీప్తిపై సత్యజిత్ కర్రతో దాడి చేశాడు. అప్పుడు దీప్తి పసివాడిని పట్టుకొని ఉంది. కర్రకు ఉన్న మేకు పసివాడి తలకు తగిలింది. పసివాడి తల నుంచి రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించారు. మెదడుకు బలమైన గాయాలు […] The post బాబు ప్రాణం తీసిన దంపతుల గొడవ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: దంపతుల మధ్య గొడవలో ఐదు నెలల పసివాడి ప్రాణం పోయిన సంఘటన ఢిల్లీలోని కొండ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సత్యజిత్(32), దీప్తి(29) అనే దంపతులు మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు గొడవకు దిగారు. దీంతో దీప్తిపై సత్యజిత్ కర్రతో దాడి చేశాడు. అప్పుడు దీప్తి పసివాడిని పట్టుకొని ఉంది. కర్రకు ఉన్న మేకు పసివాడి తలకు తగిలింది. పసివాడి తల నుంచి రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించారు. మెదడుకు బలమైన గాయాలు కావడంతో బాబు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో పోలీసులు 304 కింద కేసు నమోదు చేసి బాబు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబు తండ్రి పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో బాబు చనిపోయాడని పోస్టు మార్టమ్ లో తేలింది.

 

5 Months Old baby Dead after Fight between Parents

The post బాబు ప్రాణం తీసిన దంపతుల గొడవ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: