4 రోజుల్లో అన్నారం గేట్లు బార్లా…

  చేరిన 5.63 టిఎంసిల నీరు , 4.50టిఎంసిలు వస్తే ప్రాజెక్టు ఫుల్ , బ్యారేజీ ఇన్‌ఫ్లో 8476 క్యూసెక్కులు మేడిగడ్డలో 96.5 మీటర్లకు చేరిన నీటి నిల్వ వరంగల్ : గోదావరికి వస్తున్న సాధారణ నీటి ప్రవాహాన్ని స్టోర్ చేసి మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్న నీరు అన్నారం బ్యారేజ్‌లో 5.63 టిఎంసిలకు చేరింది. ప్రాజెక్టు నీటి సామ ర్థం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.63 టిఎంసిలకు చేరుకుంది. ఇంకా నాలుగున్నర టీఎంసీల నీరు చేరాల్సి […] The post 4 రోజుల్లో అన్నారం గేట్లు బార్లా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చేరిన 5.63 టిఎంసిల నీరు , 4.50టిఎంసిలు వస్తే ప్రాజెక్టు ఫుల్ , బ్యారేజీ ఇన్‌ఫ్లో 8476 క్యూసెక్కులు
మేడిగడ్డలో 96.5 మీటర్లకు చేరిన నీటి నిల్వ

వరంగల్ : గోదావరికి వస్తున్న సాధారణ నీటి ప్రవాహాన్ని స్టోర్ చేసి మోటార్ల ద్వారా ఎత్తిపోస్తున్న నీరు అన్నారం బ్యారేజ్‌లో 5.63 టిఎంసిలకు చేరింది. ప్రాజెక్టు నీటి సామ ర్థం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.63 టిఎంసిలకు చేరుకుంది. ఇంకా నాలుగున్నర టీఎంసీల నీరు చేరాల్సి ఉం ది. కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో ఐదు మో టా ర్లు వెట్ రన్ అవుతుండగా ప్రతీ రోజు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోస్తున్నారు. గత 3 రోజులుగా ఒక టిఎంసి చొప్పున కన్నెపల్లి నుంచి గోదావరి నీటిని ఎత్తిపోస్తుండటం ఆ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారంకు చేరుకుంది.

ఈ లెక్కన 1-0.87 టిఎంసిలకు నీరు చేరాలంటే రోజుకు ఒక టిఎంసి చొప్పున నాలుగు రోజు లు ఎత్తిపోసిన నీటితో ప్రాజెక్టు నీటి సామర్థానికి చేరుకుంటుంది. నాలుగు రోజుల్లో అన్నారం గేట్లు ఎత్తడానికి ఇప్పటికే అధికారులు సిద్ధమవుతున్నారు. కన్నెపల్లి నుంచి బ్యాక్ వాటర్‌గా వెళ్తున్న నీరు సుందిళ్ల ప్రాజెక్టుకు చేరుకుంటుంది. అన్నారం గేట్లు ఎత్తితే విడుదలయ్యే నీరు సుందిళ్ల ప్రాజెక్టుకు చేరుకుంటుంది. సుందిళ్ల నుంచి నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పంపింగ్ చేస్తారు. గోదావరి నీటి ప్రవాహం 8 వేల క్యూసెక్కుల వరకు ఉంది.

గోదావరి ప్రవాహానికి ప్రాణహిత నది నీరు తోడు కావడంతో జీవనదిగా ప్రతీ రోజు ప్రవహిస్తుంది. వచ్చిన నీరంతా కన్నెపల్లి పంప్‌హౌజ్‌లో రిజర్వ్ అవుతుంది. మిగిలిన నీరు మేడిగడ్డ ప్రాజెక్టుకు చేరుకుంటుంది. కన్నెపల్లి ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ 8 మీటర్లకు చేరుకుంది. దాని వల్ల ప్రతీ రోజు మూడు నుంచి ఐదు మోటార్లను అధికారులు వెట్ రన్ చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద 1-0 మీటర్ల నీటి నిల్వకు చేరుకుంటే ఆరో మోటారును వెట్న్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు సామర్థం 100 మీటర్లు ఉంది.

ప్రస్తుతం 97.5 మీటర్లకు నీరు చేరింది. మేడిగడ్డ ప్రాజెక్టులో వచ్చిన నీరంతా నిల్వ ఉండటం దాని బ్యాక్‌వాటర్ కన్నెపల్లి పంప్‌హౌజ్ వరకు విస్తరిస్తుంది. 1—00 మీటర్ల నీటి సామర్థం అనగా 16.17 టీఎంసీల నీరు మేడిగడ్డకు చేరుకుంటే ఆ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కన్నెపల్లి పంప్‌హౌజ్ వరకు విస్తరించి ఉంటుంది. ఆ నీటితో కన్నెపల్లి పంప్‌హౌజ్‌లోని 11 మోటార్లను వెట్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేడిగడ్డ ప్రాజెక్టులోని 16.17 టీఎంసీల నీటి నిల్వ ఉండటం వల్ల ఆ నీటిని 11 మోటార్లతో వెట్న్ చేస్తే అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల గేట్లు తెరుస్తారు.

ఆ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నిరంతరం పంపింగ్ అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా నాలుగు రోజుల్లో జరుగనుంది. గోదావరి పై నుంచి వస్తున్న వరద ఉధృతి దానికి తోడు గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతీ రోజు కురుస్తున్న భారీ వర్షాలకు వస్తున్న వరద గోదావరికి పెరుగుతుంది. వచ్చిన ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టి మోటార్లతో ఎత్తిపోవడం వల్ల ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లలో సుమారు 14 టీఎంసీల నీటిని నిల్వ చేసినట్లయింది. ఆ నీటి ప్రవాహానికి వచ్చే గోదావరి ప్రవాహం కలిసినపుడు 20 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంటుంది. 15 నుంచి 20 రోజుల పాటు నీటిని ఎల్లంపల్లికి పంపడానికి అవకాశం ఉంటుంది.

చిగురిస్తున్న రైతుల ఆశలు
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌లకు భారీగా నీటి నిల్వలు చేరుకోవడం రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో ఖరీఫ్ పంటల్ని సాగుచేయవచ్చన భరోసా కల్గుతుంది. ఈ ఖరీఫ్ సీజన్‌లో జులై మూడో వారం వరకు వర్షాల లేమి తీవ్రంగా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో వర్షపాతం తక్కువగా నమోదైంది. గోదావరి పై భాగంలోని మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగడం ద్వారా వచ్చిన వరద నీటితో మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్‌ల్లో నీటి నిల్వలు భారీగా చేరుకున్నాయి.

మేడిగడ్డ బ్యారేజ్‌లో 8 టీఎంసీలు, అన్నారం బ్యారేజ్‌లో 6 టీఎంసీల నీరు బుధవారం వరకు నిల్వ ఉన్నాయి. మొత్తం రెడింటికి కలపి 14 టీఎంసీల నీరు చేరుకుంది. గోదావరి నది ఒక పాయగా పారుతున్న నీరు సాధారణమే అనుకుని వదిలేసేదుంటే వచ్చిన నీరంతా సముద్రం పాలయ్యేది. దానికి భిన్నంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలకు వచ్చిన ప్రతీ నీటి చుక్కను వినియోగించుకోవాలని కన్నెపల్లి పంప్‌హౌజ్‌తోపాటు మేడిగడ్డ బ్యారేజ్‌లోని గేట్లన్నీ మూసివేయడం వల్ల 14 టీఎంసీల నీటిని ఒడిసిపట్టి పొదుపు చేసినట్లయింది. జులై మొదటి వారం నుంచి మొదలైన ఎత్తిపోతల నీరు రెండు వారాల్లో 6 టీఎంసీల నీటిని ప్రతీ రోజు మోటార్లతో ఎత్తిపోశారు.

గోదావరి ప్రవాహం భారీగా ఉంటే ఇప్పటికే 11 మోటార్ల వెట్న్‌త్రో రోజుకు రెండు టీఎంసీల చొప్పున 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉండేది. మహారాష్ట్ర, తెలంగాణలో తీవ్ర వర్షపాతం నమోదు కాకపోవడం వచ్చిన ప్రాణహిత ప్రవాహ నీటిని పొదుపు చేయడం వల్ల 14 టీఎంసీల నీటిని నిల్వ చేయడం జరిగింది. ముందుచూపుతో ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి బుధవారం నాటికి 14 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరో నాలుగు రోజుల్లో 6 టీఎంసీల నీరు చేరితే మేడిగడ్డతోపాటు అన్నారం బ్యారేజ్ పూర్తి స్థాయి నీటి నిల్వలకు చేరుకోవడం ఖాయం. నాలుగు రోజుల్లో అన్నారం బ్యారేజ్‌కు వస్తున్న ఇన్‌ఫ్లోను బట్టి గేట్లు ఎత్తడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

5.63 TMC of water in the Annaram Barrage

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 4 రోజుల్లో అన్నారం గేట్లు బార్లా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: