4డి ఎఫెక్ట్

మనం 2డి, 3డి, సినిమాలు చూస్తున్నాం… కాబట్టి అవి అనుభవంలోకి వచ్చాయి. మరి 4డీ అంటే.. ఎలా ఉంటుంది. ఒక్క 4డీ అనే కాదు, ఈమధ్య 5డి, 7డి, 10డి, 12డి అని చాలా పేర్లే వినిపిస్తున్నాయి. అసలీ ‘డీ’ అంటే ఏంటి వాటి ప్రత్యేకత ఏమిటో ఆ అనుభూతి ఎలా ఉంటుందో చూద్దాం..! స్మార్ట్ ఫోన్లో ఎన్ని రకాల వినోదాల్ని చూసినా సినిమా తెరల తరవాతే. అందుకే అది రోజు రోజుకీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని […] The post 4డి ఎఫెక్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనం 2డి, 3డి, సినిమాలు చూస్తున్నాం… కాబట్టి అవి అనుభవంలోకి వచ్చాయి. మరి 4డీ అంటే.. ఎలా ఉంటుంది. ఒక్క 4డీ అనే కాదు, ఈమధ్య 5డి, 7డి, 10డి, 12డి అని చాలా పేర్లే వినిపిస్తున్నాయి. అసలీ ‘డీ’ అంటే ఏంటి వాటి ప్రత్యేకత ఏమిటో ఆ అనుభూతి ఎలా ఉంటుందో చూద్దాం..!

స్మార్ట్ ఫోన్లో ఎన్ని రకాల వినోదాల్ని చూసినా సినిమా తెరల తరవాతే. అందుకే అది రోజు రోజుకీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించు కుని, ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పిస్తోంది. ప్రస్తుతం ఐమ్యాక్స్‌లూ, బిగ్‌స్క్రీన్‌ల హవా నడుస్తోంది. సాధార ణ తెరలతో పోలిస్తే ఐమ్యాక్స్‌లో తెర స్పష్టంగా బొ మ్మ పెద్దగా కనిపిస్తుంది.

మరి 4డీ అంటే…

త్రీడీలో దృశ్యం ముందుకు వచ్చిన అనుభూతి మాత్ర మే కలుగుతుంది. అంటే కళ్లకీ చెవులకీ మాత్రమే పని. కానీ 4డీలో పంచేంద్రియాలూ అనుభూతి చెందుతాయి. అంటే వర్షాన్నీ మంచునీ ఉష్ణోగ్రతనీ గాలినీ వాసననీ అన్నింటినీ ఫీల్ అవుతామన్నమాట. ఈ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించాలంటే 4డీఎక్స్ థియేటర్లకు వెళ్లాల్సిందే. థియేటర్లను కూడా ప్రత్యే కమైన సాంకేతిక పరిజ్ఞానంతో డిజైన్ చేయడం ద్వా రా సినిమాలో కనిపించేవన్నీ అనుభవంలోకి తీసు కొచ్చేదే 4డి.

4డి ఎలా ఉంటుంది?

చిత్రంలోని వాతావరణాన్ని అంటే గాలి, ఉష్ణోగ్రత, వర్షం, చలి, వాసన, శబ్దం… వంటి వాటిని స్వయం గా అనుభూతి చెందేలా చేస్తుంది. అంటే ప్రేక్షకులు కూడా సినిమాలో భాగంగా మారిపోతారు. సినిమా లో వర్షం పడుతుంటే, ఆ వాన తమ తలమీద పడు తున్నట్లు ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. ఓ సీన్ లో గాలి బలంగా వీస్తుంటే అది థియేటరులో ఉన్నవాళ్లనీ తాకుతుంది. మెరుపు మెరిస్తే, ఆ మెరు పు థియేటర్ లోపలే వచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే వాసన కూడా. హీరోయిన్ పూలతోటలో విహరిస్తుం టే ఆ గుబాళింపు ప్రేక్షుకుల ముక్కుపుటాల్నీ సోకుతుంది.

తెరమీద మంచు కురుస్తుంటే ఆ చలి వీక్షకు ల్నీ తాకుతుంది. ఇంకా దృశ్యాన్ని బట్టి సీట్లు కూడా కాస్త ముందుకీ వెనక్కీ వెళుతుంటాయి. అం టే సినిమాలో కార్లు దూసుకుపోతుంటే కుర్చీలో కూ ర్చున్నవాళ్లూ వాటి వెనకే దూసుకెళ్తున్నట్లు అనుభూతి చెందుతారు. సుమారు పదేళ్ల కిందట వ చ్చిన ‘జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్’, ‘అవతార్’ వంటి సినిమాలు కొన్ని ప్రాం తాల్లో 4డి ఎఫెక్ట్ ఉ న్న థియేటర్లలో ప్రదర్శితమ య్యాయి. ఇప్పటికే ఢి ల్లీ, ముంబై, బెంగళూరు, చె న్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో కొన్ని థియేటర్లూ ఈ 4డి ఎఫెక్ట్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి.

4D Film

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 4డి ఎఫెక్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.