వాహనాల తనిఖీల్లో రూ.48 లక్షలు పట్టివేత

  మనతెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారుల్లోని జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం సాయంత్రం 3 గంటలకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని రామోజిఫిల్మీ సిటీ గేటు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. బిఎండబ్ల్యు కారు (ఎపి 28 డిఎస్ 3456) నగర నుండి నల్లగొండ వైపు వెళ్తుండగా పోలీసులు కారును నిలిపివేసి తనిఖీ చేశారు. కారులో […]

 

మనతెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్: నగర శివారుల్లోని జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం సాయంత్రం 3 గంటలకు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలోని రామోజిఫిల్మీ సిటీ గేటు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. బిఎండబ్ల్యు కారు (ఎపి 28 డిఎస్ 3456) నగర నుండి నల్లగొండ వైపు వెళ్తుండగా పోలీసులు కారును నిలిపివేసి తనిఖీ చేశారు. కారులో రూ.48 లక్షల నగదును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ కె.సత్యపాల్‌రెడ్డి(48)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాటసింగారంలోని వివేకానంద ఇన్స్‌ట్యూట్ అండ్ టెక్నాలజీ చెందిన శ్రీనివాస్‌రెడ్డి నల్లగొండకు వచ్చాక ఫోన్ చేయమని కారు ఇచ్చాడని డ్రైవర్ తెలిపాడు. ఈ మేరకు పట్టుబడిన నగదును ప్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జీ, డిప్యూటి తహాసీల్దార్ క్రిష్టయ్యకు అప్పగించారు. అదే విధంగా సూర్యాపేట్ జిల్లా కోదాడకు చెందిన కె.శ్రీనివాస్‌రావు నగరంలోని మలక్‌పేట్‌కు వస్తుండగా బాటసింగారం కొత్తగూడం వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా (టిఎస్ 29ఇ1899) కారులో రూ.4లక్ష23 వేలు స్వాధీనం చేసుకున్నారు.

 

48 Lakhs Seized in Vijayawada Highway in Rangareddy

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: