మరోసారి డ్యూయల్ రోల్స్‌లో మెగాస్టార్..!

సైరా నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మెగా అభిమానులలో భారీ అంచనాలున్నాయి. చిరు 152వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందట. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నాడట కొరటాల. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర ఎండోమెంట్ అధికారిగా చాలా బలంగా ఉండబోతుందట. అంతేగాకుండా చిరు డ్యూయల్ రోల్స్ పోషిస్తున్నట్లు సమాచారం.

గతంలో కనిపించే ఒక చిన్న పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. ఇక చిరు హీరో ఎలివేషన్స్ థియేటర్లలో విజిల్స్ వేసే విధంగా ఉంటాయి. ఈ సినిమాలో ట్విస్టులు, పోరాట ఘట్టాలు.. ఇలా అన్నీ అంశాలు మేళవించానని ఇదివరకే చెప్పాడు కొరటాల. చిరు కోసం బాగా ఎమోషన్స్‌తో కూడిన బలమైన డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయట. అయితే ఈ సినిమాలో రాంచరణ్ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ స్ఫూర్తి పొందేది చరణ్ పాత్రనుండేనట. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నిహారిక కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. అయితే హీరోయిన్ కాజల్ త్వరలోనే ‘ఆచార్య’ షూటింగ్‌లో పాల్గొననుంది. మరో విశేషం ఏంటంటే రాంచరణ్ సరసన కూడా ఓ హీరోయిన్ కనిపించనుందట. ఆమె ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు.

Megastar Chiranjeevi play dual roles in ‘Acharya’?

The post మరోసారి డ్యూయల్ రోల్స్‌లో మెగాస్టార్..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.