40 వేల ఏళ్ల నాటి తోడేలు తల లభ్యం!

టోక్యో: సైబీరియాలో శాస్త్రవేత్తలకు దాదాపు 40 వేల ఏళ్ల నాటి తోడేలు తల ఇప్పటికీ చెక్కు చెదరకుండా లభ్యం అయింది. దీంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురైయ్యారు. మెదడుతో సహా తోడేలు తల, ఇతర భాగాలు పాడవకుండా ఉండటం విశేషం. ప్రస్తుతం కనిపించే తోడేళ్ల తల కన్నా ఈ తోడేలు తల  చాలా పెద్దదిగా ఉందని పరిశోదకులు చెబుతున్నారు. సాధారణ తోడేళ్ల తల 9 అంగుళాల వరకూ పొడవు ఉంటుంది. కానీ శాస్త్రవేత్తలకు దొరికిన ఈ రాకాసి తోడేలు […] The post 40 వేల ఏళ్ల నాటి తోడేలు తల లభ్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
టోక్యో: సైబీరియాలో శాస్త్రవేత్తలకు దాదాపు 40 వేల ఏళ్ల నాటి తోడేలు తల ఇప్పటికీ చెక్కు చెదరకుండా లభ్యం అయింది. దీంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురైయ్యారు. మెదడుతో సహా తోడేలు తల, ఇతర భాగాలు పాడవకుండా ఉండటం విశేషం. ప్రస్తుతం కనిపించే తోడేళ్ల తల కన్నా ఈ తోడేలు తల  చాలా పెద్దదిగా ఉందని పరిశోదకులు చెబుతున్నారు. సాధారణ తోడేళ్ల తల 9 అంగుళాల వరకూ పొడవు ఉంటుంది. కానీ శాస్త్రవేత్తలకు దొరికిన ఈ రాకాసి తోడేలు తల ఏకంగా 16 అంగుళాల పొడువు ఉండటంతో శాస్త్రవేత్తలే షాక్ అవుతున్నారు.
సైబీరియాలోని యాకుటియాల అనే ప్రాంతంలో ఇలి రష్యన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అల్బర్ట్‌ ప్రోటోపోపోవ్‌ బృందానికి  ఈ తోడేలు తల లభ్యమైంది. పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తల లభ్యంకావడం ఆధునిక మానవ చరిత్రలో ఇదే మొదటిసారని ఈ సందర్భంగా అల్బర్ట్‌ ప్రోటోపోపోవ్‌ అన్నారు. రాకాసి తోడేలు తల, కండరాళ్లు, మెదడు బాగానే ఉన్నాయన్నారు. ప్రస్తుత తోడేళ్ల జాతితో పాటు, సింహాలతో దీన్ని పోల్చి చూస్తామని టోక్యోకు చెందిన జికియే యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కు ప్రొఫెసర్‌ నావోకీ సుజుకి పేర్కొన్నారు.
40,000 Years Old Wolf Found

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 40 వేల ఏళ్ల నాటి తోడేలు తల లభ్యం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: