లిబియాలో వాయుసేన దాడులు… 40 మంది శరణార్థులు మృతి

ట్రిపోలి: లిబియాలో వాయు సేన దాడులు  చేయడంతో 40 మంది వలసవాదులు చనిపోయారు. తాజౌర్ ప్రాంతంలో శరణార్థులు తలదాచుకున్న భవనంపై వాయుసేన బాంబులు విసరడంతో 40 మంది మృతి చెందడమే కాకుండా 80 మంది  తీవ్రంగా గాయపడ్డారని లిబియా ప్రభుత్వ అధికారి ఒసామా అలీ ప్రకటించారు. రెస్య్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులన స్థానిక ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. శరణార్థులు తలదాచుకున్న భవనంపై దాడి చేయడం క్రూరమైన చర్య […] The post లిబియాలో వాయుసేన దాడులు… 40 మంది శరణార్థులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ట్రిపోలి: లిబియాలో వాయు సేన దాడులు  చేయడంతో 40 మంది వలసవాదులు చనిపోయారు. తాజౌర్ ప్రాంతంలో శరణార్థులు తలదాచుకున్న భవనంపై వాయుసేన బాంబులు విసరడంతో 40 మంది మృతి చెందడమే కాకుండా 80 మంది  తీవ్రంగా గాయపడ్డారని లిబియా ప్రభుత్వ అధికారి ఒసామా అలీ ప్రకటించారు. రెస్య్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులన స్థానిక ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. శరణార్థులు తలదాచుకున్న భవనంపై దాడి చేయడం క్రూరమైన చర్య అని అమెరికా నిఘా సంస్థ మండిపడింది. ఖలిఫర్ అనే నియంత లిబియాను తన ఆధీనంలోకి తీసుకోవడానికి దాడులు పాల్పడుతున్నాడని స్థానిక మీడియా వెల్లడించింది. లిబియాలో తూర్పు, దక్షిణ ప్రాంతం ఖలిఫర్ ఆధీనంలో ఉండగా ట్రిపోలి నగరాన్ని తన సొంతం చేసుకోవడానికి ఈ దాడులు చేస్తున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా లిబియాలో అంతర్గత అల్లర్లు చెలరేగడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

 

40 Migrants Dead, 80 Injured in Air Strike in Libya

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లిబియాలో వాయుసేన దాడులు… 40 మంది శరణార్థులు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: