4 ఏళ్ల తర్వాత తెరుచుకున్న సాగర్ గేట్లు

మన తెలంగాణ/హైదరాబాద్: నాలుగేళ్ల తర్వాత నాగార్జునసాగర్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి ఒకటిన్నర లక్షల క్యూసెక్కులకుపైగా నీరు రెండు రోజుల నుంచి వస్తూ ఉండడంతో ఆదివారం ఉదయానికి 585 అడుగులకంటే ఎక్కువకు చేరుకోవడంతో నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం 9 గంటలకు ఒక గేటును తెరిచారు. అధికారులు 10 గంటలకు మరో గేటును 5 అడుగుల మేర ఎత్తి, నీటిని దిగువకు వదిలారు. నాలుగేళ్ళ కిందట 2014 సెప్టెంబరు 23వ తేదీన సాగర్ గేట్లను […]

మన తెలంగాణ/హైదరాబాద్: నాలుగేళ్ల తర్వాత నాగార్జునసాగర్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి ఒకటిన్నర లక్షల క్యూసెక్కులకుపైగా నీరు రెండు రోజుల నుంచి వస్తూ ఉండడంతో ఆదివారం ఉదయానికి 585 అడుగులకంటే ఎక్కువకు చేరుకోవడంతో నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదివారం ఉదయం 9 గంటలకు ఒక గేటును తెరిచారు. అధికారులు 10 గంటలకు మరో గేటును 5 అడుగుల మేర ఎత్తి, నీటిని దిగువకు వదిలారు. నాలుగేళ్ళ కిందట 2014 సెప్టెంబరు 23వ తేదీన సాగర్ గేట్లను చివరిసారిగా తెరిచి నీటిని దిగువకు వదలగా మళ్ళీ ఇప్పుడు (సెప్టెంబరు 2వ తేదీ) ఆదివారం గేట్లు తెరవడం విశేషం. సాగునీటిపారుదల శాఖ ప్రోటోకాల్ ప్రకారం సెప్టెంబరు మాసంలో 585 అడుగులకంటే ఎక్కువ స్థాయికి నీరు చేరినట్లయితే దాన్ని నిల్వ చేసుకోకుండా దిగువకు వదలాల్సి ఉంటుంది.

సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులే అయినప్పటికీ ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో పాటు కురిసే వర్షాలకు అనుగుణంగా ఈ ప్రోటోకాల్‌ను అమలుచేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇంకా ఐదడుగుల మేర నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం కిందికి వదిలారు. సాగర్ ఇప్పుడు పూర్తిస్థాయి జలంతో కళకళలాడుతోంది. స్థానికంగా వర్షాలు కురవక పోయినా, ఎగువన కురిసిన వర్షాలతో కనీస నీటిమట్టం వద్ద ఉన్న నీరు దాదాపుగా పూర్తిస్థాయికి చేరుకుంది. అయితే ఎగువ నుంచి వస్తున్న నీరు తగ్గుముఖం పట్టడంతో మధ్యాహ్నం 12.30 గంటలకు గేట్లను బంద్ చేశారు. అయితే ఇంకా వర్షాకాలంలో మరో నెల రోజులకు పైగా ఉండడంతో నీటి ప్రవాహాన్ని బట్టి గేట్లు మరికొన్ని సార్లు తెరిచే అవకాశం ఉంటుంది. సాగర్‌కు ఉదయం నుంచి ఒకటిన్నర లక్షల క్యూసెక్కుల చొప్పున నీరు చేరుతూ ఉండగా సాయంత్రానికి అది క్రమంగా తగ్గి లక్ష క్యూసెక్కుల స్థాయికి చేరుకోవడంతో గేట్లను మూసేయాల్సి వచ్చినట్లు ప్రాజెక్టు అధకారులు తెలిపారు. మరో వైపు ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లకు 25 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుంటే, వచ్చింది వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.

జూరాలకు 54 వేల క్యూసెక్కులు వస్తుండగా 50 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర డ్యాంకు 25 వేల క్యూసెక్కులు వస్తుంటే, 16 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం డ్యాంకు 1.16 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, 1.01 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఇదిలా గోదావరి బేసిన్‌లో కడెం, ఎల్లంపల్లి రిజర్వాయర్లకు 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఇప్పటికే ఆ రిజర్వాయర్లు నీటితో నిండుగా ఉండడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్‌లో 72.6 టిఎంసిల నీరు నిల్వ ఉంది. 1085 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండగా, 1000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సింగూరుకు 155 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, దిగువకు 155 క్యూసెక్కులు వదులుతున్నారు. నిజాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరుకు ఎటువంటి ప్రవాహం వచ్చి చేరడం లేదు.

Comments

comments

Related Stories: