మహిళకు ప్రాణాంతకంగా మారిన 17వ కాన్పు

 

ముంబయి: మహారాష్ట్రలోని బిడ్ జిల్లాలో ఓ మహిళ 17వ బిడ్డను ప్రసవించనుంది. మెజల్‌గామ్ ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… 38 ఏళ్ల లంకటయ్ ఖరాట్ అనే మహిళ ఇప్పటి వరకు 16 మంది పిల్లలకు జన్మనిచ్చింది. కానీ ఆమె ఎప్పుడు ఆస్పత్రికి వెళ్లి ప్రసవించలేదు. అంత మంది పిల్లలను కూడా సుఖ ప్రసవం ద్వారానే జన్మనిచ్చింది. గత సంవత్సరం 16వ బిడ్డను జన్మనించిన అనంతరం ఆ బిడ్డ ఐదు నెలలు బతికి అనారోగ్యంతో మృతి చెందింది. 16 మందిలో తొమ్మిది మంది అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు బతికి ఉండగా మిగితా వారు అనారోగ్యంతో చనిపోయారని తెలిపారు. ఖరాట్ బరువు 45 కిలోలు ఉండడంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ అనిల్ పరదేశీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రసవం ద్వారా తల్లి ప్రాణాలకే ప్రమాదం ఉందని తెలిపారు. సదరు మహిళ ఆస్పత్రి వచ్చి వైద్యం చేయించుకోవడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చి ప్రసవించాలని వైద్యులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె పెద్ద కుమారుడు వయసు 21 సంవత్సరాలు. గతంలో హర్యానా రాష్ట్రం నూహ్ ప్రాంతంలో బిస్‌మిల్హా అనే మహిళ 23 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అత్యధిక మందికి జన్మనిచ్చిన మహిళగా బిస్‌మిల్హా తొలి స్థానంలో ఉండగా ఖరాట్ రెండో స్థానంలో ఉంది.

 

38-year-old Pregnant Will Give Birth 17th Child
38-year-old Pregnant Will Give Birth 17th Child

The post మహిళకు ప్రాణాంతకంగా మారిన 17వ కాన్పు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.