సరకుల కొరత రాదు, నిల్వ చేయకండి

  దేశ ప్రజలకు డోనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి అమెరికాలో 69కి చేరిన మృతుల సంఖ్య 3,777 మందికి వైరస్ వాషింగ్టన్ : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పంపిణీ వ్యవస్థ అమెరికాకు ఉందని, నిత్యావసరాల కొరత ఏర్పడుతుందని భయపడవద్దని, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సరకులు నిలవ చేసుకుంటేనే కొరత ఏర్పడుతుందని ఆయన అన్నారు. కరోనా భయంతో అమెరికాలో ప్రజలు నిత్యావసర వస్తువుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. […] The post సరకుల కొరత రాదు, నిల్వ చేయకండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దేశ ప్రజలకు డోనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి
అమెరికాలో 69కి చేరిన మృతుల సంఖ్య
3,777 మందికి వైరస్

వాషింగ్టన్ : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పంపిణీ వ్యవస్థ అమెరికాకు ఉందని, నిత్యావసరాల కొరత ఏర్పడుతుందని భయపడవద్దని, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సరకులు నిలవ చేసుకుంటేనే కొరత ఏర్పడుతుందని ఆయన అన్నారు. కరోనా భయంతో అమెరికాలో ప్రజలు నిత్యావసర వస్తువుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ మొత్తంలో సరకులు కొంటుండడంతో అధ్యక్షుడు ఈ హామీ ఇచ్చారు. జనం ఎక్కువ సరకులు కొనడంతో దుకాణాల్లో సరకులు వేగంగా అయిపోతున్నాయి. దుకాణాల్లో నిల్వలు ఖాళీ అయిన చిత్రాల్ని , విజువల్స్ నుఅమెరికా ప్రధాన మీడియా, వార్తా పత్రికలు, ఛానళ్లు చూపించాయి. సరకులు నిండుకోవడంతో ఇటలీ, స్పెయిన్ వంటి యూరోపియన్ దేశాల్లో దుకాణాలు మూతబడిన విజువల్స్ చూసి అమెరికన్లలో ఆందోళన, ఆతృత నెలకొన్నాయి. కొన్ని వారాలకు సరిపడా నిత్యావసరాలు నిల్వ చేయాలనుకుంటున్నారు.

ఈ పరిస్థితిని గమనించిన ట్రంప్ కిరాణా సరకుల కంపెనీల యజమానులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. వీరిలో ఆల్బర్ట్‌సన్ కంపెనీ ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్న ఇండియన్ అమెరికన్ శంకరన్ కూడా ఉన్నారు.‘ప్రజలు బయటికి వెళ్లి ఎక్కువ సరకులు కొంటున్నారు. అలా కొనవద్దని చెప్పాలనుకుంటున్నాను. మనకు మంచి పంపిణీ వ్యవస్థ ఉంది. ఎక్కువగా కొనాల్సిన పని లేదు. ఆందోళన వద్దు. హాయిగా ఉండండి’ అని డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్ విలేకరుల సమావేశంలో సలహా ఇచ్చారు. సరిపోయినంత ఆహార వస్తువుల సప్లై ఉందని కార్పొరేట్ యజమానులు తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ఇలా ఉండగా అమెరికాలో తాజాగా కరోనా వల్ల మరో పదిమంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 69కి చేరింది. 3,777 మందికి ఈ వైరస్ సోకింది.

3774 infected and 69 deaths in US

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సరకుల కొరత రాదు, నిల్వ చేయకండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: