సెక్ష‌న్ 377పై తుది తీర్పు రేపే…

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమా కాదా అనే అంశాన్ని గురువారం సుప్రీం కోర్టు తేల్చనున్నది. వివాదాస్పద 377 సెక్షన్ పై సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును ఇవ్వనున్నది. ఐపిసి లోని 377 సెక్షన్ ప్రకారం స్వ‌లింగ సంప‌ర్కం నేరం. దాన్ని స‌వాల్ చేస్తూ అనేక పిటిష‌న్లు సుప్రీం కోర్టులో దాఖ‌లు అయ్యాయి. సెక్ష‌న్ 377కు రాజ్యాంగ నిబ‌ద్ద‌త ఉందా లేదా అన్న అంశాన్ని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం సెప్టెంబ‌ర్ 6వ తేదిన తేల్చ‌నున్నారు. స్వలింగ సంపర్కం అంశంపై తాము […]

న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమా కాదా అనే అంశాన్ని గురువారం సుప్రీం కోర్టు తేల్చనున్నది. వివాదాస్పద 377 సెక్షన్ పై సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును ఇవ్వనున్నది. ఐపిసి లోని 377 సెక్షన్ ప్రకారం స్వ‌లింగ సంప‌ర్కం నేరం. దాన్ని స‌వాల్ చేస్తూ అనేక పిటిష‌న్లు సుప్రీం కోర్టులో దాఖ‌లు అయ్యాయి. సెక్ష‌న్ 377కు రాజ్యాంగ నిబ‌ద్ద‌త ఉందా లేదా అన్న అంశాన్ని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం సెప్టెంబ‌ర్ 6వ తేదిన తేల్చ‌నున్నారు. స్వలింగ సంపర్కం అంశంపై తాము ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామని, సుప్రీంకోర్టు విచక్షణకే ఈ అంశాన్ని వదిలివేస్తున్నామని అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి కేంద్రం ఇటివ‌ల తెలిపింది. సెక్ష‌న్‌ 377ను రద్దు చేయాలంటూ పెట్టుకున్న అభ్యర్థనలపై సుప్రీం సీనియర్ జడ్జిలు విచారణ చేపడుతున్నారు