ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 35మంది మృతి

 

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ నగరంలో తెల్లవారుజామున సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో 35మంది మృతిచెందారు. రాణి ఝాన్సీ రోడ్ లో అనంజ్ మండి ప్రాంతంలోని ఓ భవనంలో ఆదివారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఘోర ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరకుని సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాద సమయంలో భవనంలో సుమారు 70 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, భవనంలో నుంచి బయటికి తీసిన కొంతమంది తీవ్రంగా గాయపడడంతో వెంటనే చికిత్స నమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇందులో 35మంది పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన మరో 50 మందిని మెరుగైన చికిత్స కోసం ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రి, హిందూ రావు ఆస్పత్రికి తరలించారు. కాగా, భవనంలో చిక్కుకున్న మరికొంత మంది కోసం రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తోంది. మొత్తం 27 ఫైర్ ఇంజన్స్ తో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే, భవనంలో దట్టంగా పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు కష్టమవుతున్నట్లు డిప్యూటీ ఫైర్ చీఫ్ ఆఫీసర్ సునీల్ చౌదరి తెలిపారు.

35 Killed in Fire broke out in Delhi

The post ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 35మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.