దారులు విశాలం.. సౌకర్యాలు శూన్యం

  నేరడిగొండ: మరణం క్రమక్రమంగా జ్ఞాపకాల దొంతర్లలో మరుగన పడిపోయో చేదు జ్ఞాపకం కాని గాయం జీవితాంతం వేదనను మిగిల్చి, భవిషత్‌ను అంధకారం చేసే విషాదం. రెండింటిలో ఏది సంభవించినా సాఫీగా సాగిపోయో జీవన నౌక ఒడిదొడుకులకు లోనవక తప్పదు. 1150 కోట్లతో 120 కిలోమీటర్ల పొడవు, వాహనదారుల, ప్రజలకు జేబులకు చిల్లు పెట్టే రెండు టోల్ ప్లాజాలతో జిల్లాలోని 44వ జాతీయ రహదారి అసౌకర్యాలకు చిరునామాగా ఉంది. గ్రామాల్లో వీధీ దీపాలు లేక, సర్వీసు రోడ్లు, […] The post దారులు విశాలం.. సౌకర్యాలు శూన్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేరడిగొండ: మరణం క్రమక్రమంగా జ్ఞాపకాల దొంతర్లలో మరుగన పడిపోయో చేదు జ్ఞాపకం కాని గాయం జీవితాంతం వేదనను మిగిల్చి, భవిషత్‌ను అంధకారం చేసే విషాదం. రెండింటిలో ఏది సంభవించినా సాఫీగా సాగిపోయో జీవన నౌక ఒడిదొడుకులకు లోనవక తప్పదు. 1150 కోట్లతో 120 కిలోమీటర్ల పొడవు, వాహనదారుల, ప్రజలకు జేబులకు చిల్లు పెట్టే రెండు టోల్ ప్లాజాలతో జిల్లాలోని 44వ జాతీయ రహదారి అసౌకర్యాలకు చిరునామాగా ఉంది. గ్రామాల్లో వీధీ దీపాలు లేక, సర్వీసు రోడ్లు, ప్రయాణ ప్రాంగణాలు, అండర్ బ్రిడ్జీలు కొరవడి, అభద్రతల మధ్య ప్రయాణీకులు ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ఒక్క నేరడిగొండ మండల పరిధిలోని జాతీయ రహదారిపై 2010 నుండి 2019 డిసెంబర్ 29వ తేదీ వరకు 323 పైగా ప్రమాదాలు జరుగగా.. ఇందులో 111మంది మృత్యువాత పడ్దారు. నేరడిగొండ మండలంలోని లకంపూర్(జి), కిష్టాపూర్, రోల్‌మామడ, శంకరపూర్, కొర్టికల్(బి) వద్ద ప్రయాణ ప్రాంగణాలు, సర్వీస్ రోడ్లు లేకపోవడంతో ప్రజలు రాకపొకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 100 కిలోమీటర్ల పొడవునా ఏ గ్రామం వద్ద కూడ వీధీ దీపాలు లేకపోవడంతో చీకటి పడిందంటే అంధకారం అలుముకుంటుంది.

అక్కడక్కడ నిఘా కోసం ఉంచిన సిసి కెమెరాలు వినియోగంలో లేకపోగా, అండర్ బ్రిడ్జిలో ఉంచిన మెర్కురీ దీపాలు పనిచేయడం లేదు. రోడ్డు వెంబడి గ్రామాల వద్ద మంచినీటి ఏర్పాటు చేసిన అందులో ఎప్పుడు నీటిని పొసినా పపానపోలేదు. ఐదు కిలోమీటర్లకు ఒక ఫోన్ బాక్స్‌ను ఏర్పాటు చేయగా.. అవి కూడా నామ మత్రంగా పని చేస్తాయి. మండలంలోని గుత్పాల, దేవుల్‌ నాయక్‌ తండా, యపల్‌గూడ గ్రామాలకు వెళ్లడానికి ఒకే కూడలి ఏర్పాటు చేశారు. దానివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో ఇప్పటికైన జాతీయ రహదారి సమస్యలను పరిస్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కొరుతున్నారు.

323 Accidents on 44th National Highway in Adilabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దారులు విశాలం.. సౌకర్యాలు శూన్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.