చిన్నారిని హతమార్చిన మేనమామ…

నల్గొండ: చిన్నారిని సొంత మేనమామ హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని చిన్నగూడెం గ్రామంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్న గూడెం గ్రామానికి చెందిన లక్ష్మిని గుంటూరు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన పిడతల వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. లక్ష్మితన రెండోసారి ప్రసవం కోసం తన తల్లి ఊరైన పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి వచ్చి ఇంట్లోనే రెండో సంతానంగా ఝాన్సీరాణికి […] The post చిన్నారిని హతమార్చిన మేనమామ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్గొండ: చిన్నారిని సొంత మేనమామ హత్య చేసిన సంఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండల పరిధిలోని చిన్నగూడెం గ్రామంలో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిన్న గూడెం గ్రామానికి చెందిన లక్ష్మిని గుంటూరు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన పిడతల వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. లక్ష్మితన రెండోసారి ప్రసవం కోసం తన తల్లి ఊరైన పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి వచ్చి ఇంట్లోనే రెండో సంతానంగా ఝాన్సీరాణికి జన్మనిచ్చింది. గురువారం వెంకటేశ్వర్లు, లక్ష్మిల పెద్ద కుమార్తె పుట్టిన రోజు కావడంతో వేడుకలను చిన్నారి తల్లి దండ్రులు చిన్నగూడెం గ్రామంలో జరుపుకున్నారు.

అదే రోజున తన చెల్లి ప్రసవం ఖర్చులు, పెద్ద కోడలు జన్మదిన వేడుకల ఖర్చుల గురించి గోగు ఉపేందర్‌కు తన తల్లి చెప్పగా తన మేన కోడలైన ఝాన్సీరాణిపై అసూయ పెంచుకొని గురువారం అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో తన మేన కోడలిని కాళ్లు పట్టుకొని గోడకు బలంగా కొట్టడంతో చిన్నారి చెవి,ముక్కుల నుంచి రక్త స్రావం అయి అక్కడికక్కడే మృతి చెందింది . పారిపోతున్న హతుడు మేనమామని గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. మృతిరాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మోహన్ బాబు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

3 Years Baby Killed By Her Uncle In Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిన్నారిని హతమార్చిన మేనమామ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: