అర్జున అవార్డు గ్రహీత కారు ఢీకొని ముగ్గురు మృతి

 

 

జైపూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతంలో కారు రేసు ప్రమాదానికి రైతు కుటుంబం బలి అయింది. అర్జున అవార్డు గ్రహీత గౌరవ్ గిల్స్ కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. జోధ్‌పూర్ ప్రాంతంలో కలెక్టర్ అనుమతి తీసుకోకుండా గత రెండు రోజుల నుంచి కారు రేసింగ్ జరుగుతుంది. కారు రేసింగ్ జరుగుతున్న ప్రాంతాలలో ఉన్న గ్రామాల ప్రజలకు ఈవెంట్ మేనేజర్లు పలు సూచనలు చేశారు. రామ్ సింగ్ అనే రైతు పొలం పనులు వెళ్లడానికి రేసింగ్ జరగే రోడ్డును దాటి వెళ్లాలి. తన భార్య పుష్ప, కుమారుడు జితేందర్‌ను బైక్‌పై ఎక్కించుకొని అతడు రోడ్డు దాటుతుండగా 150 కిలో మీటర్ల స్పీడుతో వచ్చిన రేసింగ్ కారు ఆ బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ముగ్గురు ఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. కారు డ్రైవ్ చేసిన పాల్ఘున్ ఉర్స్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్థులు అక్కడికి చేరుకొని మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు ఉద్యోగం ఇప్పించాలని ధర్నాకు దిగారు. ఈ ఘటనపై జోధ్‌పూర్ జిల్లా కలెక్టర్ హిమాన్షు గుప్తా స్పందించారు. కారు రేస్ ర్యాలీకి అనుమతి తీసుకోలేదని కలెక్టర్ తెలిపారు. కారు రేస్ జరిగే ప్రాంతాలలో సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ రేసులో 53 టీమ్‌లు పాల్గొన్నట్టు సమాచారం.

 

3 Members Dead in Arjuna awardee’s car hits bike

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అర్జున అవార్డు గ్రహీత కారు ఢీకొని ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.