ప్రాణాలు తీసిన పూడికతీత

 బావిలో ఊపిరాడక ముగ్గురు మృతి  కొమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేటలో ఘోర విషాదం మన తెలంగాణ/మంచిర్యాల: మృత్యుబావి ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొంది. పూడిక తీత పనుల కోసం బావిలోకి దిగిన ముగ్గురు యువకులు ఆక్సిజన్ లభించక విష వాయువులు వెలువడడంతో మృత్యువాత పడ్డారు. బుధవారం కొమురంభీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామంలో జరిగిన ఈ సంఘటన విషాదాన్ని మిగిల్చింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన […] The post ప్రాణాలు తీసిన పూడికతీత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 బావిలో ఊపిరాడక ముగ్గురు మృతి
 కొమురం భీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేటలో ఘోర విషాదం

మన తెలంగాణ/మంచిర్యాల: మృత్యుబావి ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొంది. పూడిక తీత పనుల కోసం బావిలోకి దిగిన ముగ్గురు యువకులు ఆక్సిజన్ లభించక విష వాయువులు వెలువడడంతో మృత్యువాత పడ్డారు. బుధవారం కొమురంభీం జిల్లా కౌటాల మండలం ముత్యంపేట గ్రామంలో జరిగిన ఈ సంఘటన విషాదాన్ని మిగిల్చింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన కారం మల్లయ్యకు చెందిన మంచినీటి బావిలో పూడిక పేరుకపోవడం వల్ల దానిని తీయడం కోసం అతని కుమారునితో పాటు అతనికి చెందిన ఇద్దరు బంధువులు బావిలో దిగి ఊపిరి ఆడక మృతి చెందారు. మొదట కారంమల్లయ్య కుమారుడు కారం మహేష్ (19) బావిలోకి దిగి రాకపోవడంతో అతని పెద్దమ్మ కుమారుడు గజ్జి రాకేష్(24) బావిలోకి దిగాడు. ఇద్దరు రాకపోయే సరికి వరుసకు బావ అయ్యే చొక్కాల శ్రీనివాస్ సైతం మంచినీటి బావిలోకి దిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. మంచినీటి బావి గత కొన్ని సంవత్సరాలుగా ఉపయోగంలో లేక పోవడంతో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందు వల్ల పూడిక తీత పనులు చేపడితే బావిలోకి నీరు చేరుతాయని భావించిన ముగ్గురు ఆక్సిజన్ అందక విషవాయువుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న కౌటాల సిఐ మోహన్, ఎస్‌ఐ ఆంజనేయులు, తహసీల్దార్ రామ్మోహన్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బావిలోకి దిగిన ముగ్గురు వ్యక్తులు పైకి రాకపోవడంతో అనుమానించిన పోలీసులు ఒక కోడికి తాడుకట్టి బావిలోకి దించారు. కొద్ది సెకన్‌ల సమయంలోనే కోడి కూడా చనిపోవడంతో ఆక్సిజన్ లభించక ఊపిరి ఆడకుండా ముగ్గురు వ్యక్తులు మరణించారని దృవీకరించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జెసిబిని తెప్పించి బావికి సమాంతరం తవ్వకాలు చేపట్టి మృతదేహాలను వెలికి తీసేందుకు యత్నిస్తున్నారు. మిషన్ భగీరథ పనులు చేస్తున్న పెద్ద జెసిబిని తెప్పించి తవ్వకాలు జరుపుతుండగా బుధవారం రాత్రి వరకు కూడా మృతదేహాలను వెలికి తీసే అవకాశాలు కనిపించడం లేదు. కొమురంభీం ఆసిఫా బాద్ జిల్లా కేంద్రం నుంచి రెస్కూ బృందాలను రంగంలోకి దింపారు. మంచినీటి బావి వెడల్పు మూడు ఫీట్లు, లోతు 36 ఫీట్లు ఉండడంతో రెస్కూ సిబ్బంది బావిలోకి దిగేందుకు సాహసించడం లేదు. సంఘటన స్థలంలో పోలీసులు బావి వద్దకు ఎవరు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ సంఘటన తో ముత్యంపేట గ్రామంలో బంధువుల రోథనలు మిన్నంటాయి. మృతదేహాల కోసం ఎదురు చూస్తున్నారు.

3 Killed In Well In Mancherial District

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రాణాలు తీసిన పూడికతీత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.