చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

మనతెలగాణ/ఇందల్వాయి: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ ఎదురుగా హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్‌వైపు వెళుతుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ధర్పల్లి మండలంలో జరిగిన ఒక విందులో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతి చెందినవారిని బాడ్సి గ్రామానికి చెందిన బాలకృష్ణ, గౌతంరెడ్డి, నిఖిల్ లుగా గుర్తించారు. మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఇందల్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డిచ్‌పల్లి సిఐ వివరాలు ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన ఒకరు, వినాయక్‌నగర్‌కు చెందిన ఒకరు, ఆర్యనగర్‌కు చెందిన మరొకరు కలిసి పెళ్లి విందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురికాగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

3 Killed in Car Accident in Nizamabad

The post చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.