ముంబయిలో కూలిన మూడంతస్థుల భవనం…

  ముంబయి: ముంబయి ఫోర్ట్ ప్రాంతంలో ఓ మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. పాల్గొన్న రెస్క్యూ టీమ్ ఇప్పటివరకూ 17 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరికొందరు భవనం కింది చిక్కుకోవడంతో సహాయకచర్యల్ని ముమ్మరం చేశారు. మంగళ్‌దాస్ రోడ్డులోగల లోహ్రా చాల్‌లోని యూసుఫ్ పేరుతో ఉన్న భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ భవనాన్ని 1959కి ముందుగా నిర్మించినట్లు […] The post ముంబయిలో కూలిన మూడంతస్థుల భవనం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: ముంబయి ఫోర్ట్ ప్రాంతంలో ఓ మూడంతస్థుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పలువురు శిధిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ సంఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. పాల్గొన్న రెస్క్యూ టీమ్ ఇప్పటివరకూ 17 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరికొందరు భవనం కింది చిక్కుకోవడంతో సహాయకచర్యల్ని ముమ్మరం చేశారు. మంగళ్‌దాస్ రోడ్డులోగల లోహ్రా చాల్‌లోని యూసుఫ్ పేరుతో ఉన్న భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. ఈ భవనాన్ని 1959కి ముందుగా నిర్మించినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

3 Floor building collapsed in Mumbai

The post ముంబయిలో కూలిన మూడంతస్థుల భవనం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: