జెట్ ఎయిర్‌వేస్ వాటాల కొనుగోలుకు 3 బిడ్లు

  బిడ్ దాఖలు చేయని ఎతిహాద్ ముంబయి: ప్రస్తుతం మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల కొనుగోలుకు బిడ్డింగ్ దాఖలకు చివరి రోజయిన శనివారం నాటికి ఆ సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు కేవలం మూడు దరఖాస్తులు మాత్రమే అందాయి. కాగా కాగా జెట్ ఎయిర్‌వేస్ భాగస్వామి అయిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ బిడ్ దాఖలు చేయకపోవడం గమనార్హం. ఎతిహాద్‌కు జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటా ఉంది. జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బ్యాంకులకు […] The post జెట్ ఎయిర్‌వేస్ వాటాల కొనుగోలుకు 3 బిడ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బిడ్ దాఖలు చేయని ఎతిహాద్

ముంబయి: ప్రస్తుతం మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల కొనుగోలుకు బిడ్డింగ్ దాఖలకు చివరి రోజయిన శనివారం నాటికి ఆ సంస్థకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు కేవలం మూడు దరఖాస్తులు మాత్రమే అందాయి. కాగా కాగా జెట్ ఎయిర్‌వేస్ భాగస్వామి అయిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ బిడ్ దాఖలు చేయకపోవడం గమనార్హం. ఎతిహాద్‌కు జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటా ఉంది. జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేస్తూ బ్యాంకులకు మూడు కంపెనీల నుంచి మూడు అభ్యర్థనలు (ఇఓఎల్)అందాయని, వాటిలో రెండు కంపెనీలు ఫైనాన్షియల్ రంగంలో ఉన్నవి కాగా, మరోటి అంతర్జాతీయ విమానయాన రంగానికి చెందినదని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. నిజానికి బిడ్లు దాఖలు చేయడానికి ఈ నెల 3 వరకే గడువు ఉండగా ఆ గడువును మరో వారం రోజులు పొడిగించారు.

కాగా మూడు దరఖాస్తులు అందాయని, ఈ సారి ఎత్తెహాద్ బిడ్ దాఖలు చేయలేదని బ్యాంకు వర్గాలు తెలిపాయి. కాగా గతంలో ఆసక్తి చూపించిన మిగులు నిధులు పుష్కలంగా ఉన్న హిందుజాగ్రూపు కూడా ఈ సారి బిడ్ దాఖలు చేయలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బిడ్స్ దాఖలు చేసిన వాటిలో పనామాకు చెందిన ఫైనాన్స్ సంస్థ అవంటుటో ఒకటని తెలుస్తోంది. ఈమూడు దరఖాస్తుల ఆర్థిక స్థోమతును నిర్ధారించుకోవడానికి మధ్యవర్తిత్వ పరిష్కర్త అశీష్ చాచారియా వీటిని పరిశీలిస్తారని తెలుస్తోంది. గత ఏప్రిల్ మధ్యనుంచి కార్యకలాపాలను నిలిపివేసిన జెట్ ఎయిర్‌వేస్‌లో వాటాల వ్కిరయం కోసం గత నెల బిడ్స్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత మార్చినుంచి జెట్ ఎయిర్‌వేస్‌లో 51 శాతం వాటాలతో ఆ సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు సంస్థకు యజమానులుగా ఉన్న విషయం తెలిసిందే.

3 entities bid for Jet Airways as deadline ends

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జెట్ ఎయిర్‌వేస్ వాటాల కొనుగోలుకు 3 బిడ్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: