3డి ఆడియో మీకోసం…

3D-Audio

3డి టెక్నాలజీ అంటే త్రీ డైమెన్షనల్ టెక్నాలజీ. రాబోయే కాలం అంతా ఈ సాంకేతికతదే. టివి, ల్యాప్‌టాప్, ఇతర ఉత్పత్తులలో త్రీడిదే ముఖ్య భూమిక.  ఆటల్లో, ఎంటర్‌టెయిన్‌మెంట్ రంగంలో విప్లవాత్మక మార్పు రానుంది. వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులతో ముందుకు వస్తోంది 3డి టెక్నాలజీ. అదీ ఇదీ అని లేదు, ఒకటి సంభవం, ఇంకోటి అసంభవం అని లేదు. 3డితో ఏదైనా సాధ్యమే. కొత్త త్రీడి టెక్నాలజీ, చీకటి లేకుండా పూర్తి వెలుగుతో కన్పిస్తుంది. ఏ కోణంల్లో చూసినా ఒకే స్పష్టత. చూసేటప్పుడు కళ్ల మీద అసలు ఒత్తిడి పడదు. ప్లే స్టేషన్ విభాగం వారు, సోనీ గల్ఫ్ fze వారి కొత్త ఉత్తత్తులు, సేవలు త్రీడి టెక్నాలజీ ఆధారంగా ఉండబోతున్నాయని చెప్పారు.

త్రీడిలలో సినిమాలు, కొన్ని వీడియోలను మనం చూసే ఉంటాం. దాదాపుగా అన్ని సినిమాలు త్రీడి వర్షన్ లలో విడుదల చేస్తున్నారు. సినిమా షూటింగ్ లలో కూడా త్రీడి టెక్నాలజీని వాడుతున్నారు. రిసెంట్ గా ఆడియోలు కూడా త్రీడిలలో విడుతులవుతున్నాయి. త్రీడి టెక్నాలజీ లో పాట విటుంటే మధురానుభూతి కలుగుతోంది. ఒక చెవిలో సౌండ్  తగ్గుతూ ఉంటే రెండో చెవిలో సౌండ్ పెరుగుతుంది. పాటలు విటుంటే థీయేటర్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. త్రీడి సౌండ్ 360 డిగ్రీలో  అద్భుతంగా వినిపిస్తుంది. బయట మైక్ సెట్ నుంచి  పాటలు విన్న ఫీలింగ్ కలుగుతుంది. త్రీడి యాప్ లు కూడా మార్కెట్ లో కి విడుదల చేశారు.