258వ రోజుకు చేరిన జగన్ పాదయాత్ర

YCP Chief Jagan Padayatra Held in Visakhapatnam

విశాఖ : వైసిపి చీఫ్ జగన్ పాదయాత్ర ఆదివారంతో 158వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన తన పాదయాత్రను గోపాలపట్నం నుంచి ప్రారంభించారు. ఈ పాదయాత్ర గోపాలపట్నం జంక్షన్, బాజీ జంక్షన్, ఎన్‌ఎడి జంక్షన్, ఓల్డ్ కరాస, మర్రిపాలెం, కంచరపాలెం మీదుగా తాటిచెట్ల పాలెం వరకు కొనసాగనుంది. కంచరపాలెంలో ఈరోజు సాయంత్రం జరిగే వైసిపి బహిరంగసభలో జగన్ ప్రసంగిస్తారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు.

YCP Chief Jagan Padayatra Held in Visakhapatnam

Comments

comments