గుండెపోటుతో 25 ఏళ్ళ కానిస్టేబుల్ మృతి

Old-man-dead

 

కొమ్రంభీమ్ అసిఫాబాద్: గుండెపోటుతో 25 ఏళ్ళ ఓ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని కౌటాల పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. జిల్లాలోని కెరమెరి మండలానికి చెందిన రాథోడ్ మనోజ్, కౌటాల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, బుధవారం నైట్ డ్యూటీలో ఉన్న రాథోడ్ కాసేపు విశ్రాంతి తీసుకుందామని స్టేషన్ లో పడుకున్నాడు. ఈ సమయంలో నిద్రలోనే అతనికి గుండెపోటు రావడంతో మరణించాడు. గురువారం ఉదయం హెడ్ కానిస్టేబుల్ వచ్చి నిద్రలేపినా లేవకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, రాథోడ్ కు 2018లో కౌటాల పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ వచ్చింది. అప్పటి నుంచి తన కెరీర్ ను ప్రారంభించిన రాథోడ్ రెండు సంవత్సరాలు గడవకముందే ఇలా మరణించడంతో అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

25 yrs old Constable died of heart attack in police station

The post గుండెపోటుతో 25 ఏళ్ళ కానిస్టేబుల్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.